తెలంగాణ

telangana

ETV Bharat / international

సోషల్ మీడియాను బ్యాన్​ చేస్తున్న ఆస్ట్రేలియా!​- పిల్లలు వాడాలంటే అప్పటివరకు ఆగాల్సిందే! - SOCIAL MEDIA BAN FOR CHILDREN

సోషల్​ మీడియా వాడటానికి వయోపరిమితి విధించనున్న ఆస్ట్రేలియా - సోషల్​ మీడియా వాడాలంటే కనీస వయసు 16ఏళ్ల ఉండేలా చట్టం

Social Media Ban In Australia
Social Media Ban In Australia (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2024, 8:37 PM IST

Updated : Nov 7, 2024, 10:41 PM IST

Social Media Ban In Australia :పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా సామాజిక మాధ్యమాలు ఉపయోగించడానికి కనీసం 16ఏళ్ల వయసు ఉండేలా పరిమితి విధించనున్నట్లు గురువారం ప్రకటించింది. సోషల్ మీడియా తమ పిల్లలకు హాని చేస్తోందని, దాన్ని ఉపయోగించడానికి సమయం ఉండాలని తాను కోరుతున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ అన్నారు. చట్టం ఆమోదించిన 12 నెలల తర్వాత వయోపరిమితి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ చట్టం అమలైన తర్వాత, ఎక్స్​, టిక్​టాక్, ఇన్​స్టాగ్రామ్, ఫేస్​బుక్​ వంటి- సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​లు 16ఏళ్ల లోపు పిల్లలను తమ సైట్ల నుంచి ఎలా మినహాయించాలో తెలుసుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించాలి. కాగా, దీనికి సంబంధించిన చట్టాన్ని నవంబర్ 18న ఆస్ట్రేలియా పార్లమెంట్​లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వయోపరిమితిని సోషల్ మీడియా సంస్థలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు. పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఫైన్​ విధించరు.

తాను చాలా మంది పిల్లల తల్లిదండ్రులు, తాతలు, ఆంటీలు, అంకుల్స్​తో మాట్లాడానని ఆంథోనీ అల్బనీస్​ తెలిపారు. వారు కూడా తన లాగే ఆన్​లైన్​లో పిల్లల భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. చిన్న పిల్లలకు యాక్సెస్ నిరోధించడానికి సహేతుకమైన చర్యులు తీసుకుంటున్నామని తెలిపే బాధ్యత సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​లపై ఉంటుందన్నారు. అది పిల్లల తల్లిదండ్రులకు ఉండదన్నారు.

దీనిపై ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​ మాతృసంస్థ మెటా, హెడ్​ ఆఫ్​ సేఫ్టీ యాంటిగోన్ డేవిస్ స్పందించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న వయోపరిమితులను తమ కంపెనీ గౌరవిస్తుందని చెప్పారు. అయితే ఈ నిబంధనలను ఎలా అమలు చేయాదానిపై లోతైన చర్చ జరగలేదని చెప్పారు. అయితే యాప్​ స్టోర్​లలో, ఆపరేటింగ్​ సిస్టమ్​లలో సమర్థవంతమైన టూల్స్​తో తల్లిదండ్రులువారి పిల్లలు ఏ యాప్​ వాడాలో నియంత్రించవచ్చని చెప్పారు. ఇది చాలా సులభమైన, సమర్థవంతమైన పరిష్కారం అని అభిప్రాయపడ్డారు. కాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రకటనపై సామాజిక మాధ్యమం ఎక్స్​ ఇంకా స్పందించలేదు.

'బ్యాన్​ వారి మానసిక ఆరోగ్యం ప్రభావం చూపుతుంది'
అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని యూత్ మెంటల్ హెల్త్ సర్వీస్ సంస్థ 'రీచ్‌అవుట్‌' డైరెక్టర్ జాకీ హాలన్​ వ్యతిరేకించారు. ఆస్ట్రేలియాలో 73 శాతం మంది యువకులు మానసిక ఆరోగ్య గురించి సహాయాన్ని సోషల్ మీడియా ద్వారా పొందుతున్నారని తెలిపారు. యుక్తవయసున్న వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తినా- తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి మద్దతు పొందే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. ఎందుకంటే వారు చాలా ఇబ్బందుల్లో పడతామని వారు అనుకుంటారు. అందులే తల్లిదండ్రులకు చెప్పలేరని అభిప్రాయపడ్డారు. మరోవైపు, సోషల్​ మీడియా ఉపయోగించేందుకు కనీస వయసు 12 లేదా 13ఏళ్లు ఉంటే సులభంగా అమలు చేసే అవకాశం ఉందని చైల్డ్​ సైకాలజిస్ట్​ ఫిలిప్​ టామ్​ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Last Updated : Nov 7, 2024, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details