Sheikh Hasina Arrest Warrant :బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సహా 46 మందిపై అరెస్ట్ వారంట్ జారీ అయింది. బంగ్లాకు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్-ఐసీటీ ఈ ఆదేశాలను జారీ చేసింది. వారిలో అవామీ లీగ్‌కు చెందిన కీలక నేతలు కూడా ఉన్నారు. నవంబరు 18లోగా హసీనా సహా అందరిని అరెస్టు చేసి తమ ఎదుట హాజరు పరచాలని అధికారులను ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.
'నెలలోగా ఆమె మా ముందు ఉండాలి!'- షేక్ హసీనాపై బంగ్లా స్పెషల్ కోర్టు అరెస్ట్ వారంట్ - SHEIKH HASINA ARREST WARRANT
మాజీ ప్రధాని షేక్ హసీనా సహా 46 మందిపై బంగ్లాదేశ్ అరెస్ట్ వారంట్ - నవంబర్ 18లోగా వారిని అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరుపరచాలన్న బంగ్లా ప్రత్యేక కోర్టు
Published : Oct 17, 2024, 3:02 PM IST
జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన బంగ్లా మారణకాండలో, ఇతర నేరాల ఆరోపణలపై హసీనాకు వ్యతిరేకంగా ఐసీటీకి 60 ఫిర్యాదులు అందాయి. వాటిపై ఐసీటీ ఇటీవల దర్యాప్తు ప్రారంభించింది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పిస్తామని, ఆమెపై అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తామని ఐసీటీ నూతన ప్రాసిక్యూటర్ ఇటీవల పేర్కొన్నారు. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలోనే ఈ తాజా ఆదేశాలను ఐసీటీ జారీ చేసింది.