తెలంగాణ

telangana

ETV Bharat / health

కడుపు నిండా తిన్న తర్వాత అలా చేస్తున్నారా? అయితే సమస్యలు కొని తెచ్చుకున్నట్లే! - Things Not To Do After Eating

What Not To Do After Eating : కడుపు నిండా తర్వాత ఎవరికైనా సరే హాయిగా రిలాక్స్ అవాలనిపిస్తుంది. మత్తుగా నిద్రపోవాలనిపిస్తుంది. కానీ ఇలా చేయచ్చా? తృప్తిగా తిన్న తర్వాత విశ్రాంతి తీసుకోవడం లేదా నిద్రపోవడం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

What Not To Do After Eating
What Not To Do After Eating (Source : Getty Images)

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 7:54 AM IST

What Not To Do After Eating :కడుపు నిండా తిన్న తర్వాత కొన్ని నిమిషాలు అనేవి జీర్ణక్రియతో పాటు పూర్తి ఆరోగ్య శ్రేయస్సుకు చాలా కీలకమైనవి. సరైన జీవక్రియ, ఆరోగ్యం కోసం తిన్న వెంటనే మనం కొన్ని ఆహారాలకు దూరంగా ఉండక తప్పదట. కొన్ని పనులను పక్కకు పెట్టాల్సి వస్తుందట. మనకు సంతోషాన్నిచ్చేవి, సౌకర్యంగా అనిపించేవి అయినప్పటికీ తృప్తిగా తిన్న తర్వాత కొన్ని అలవాట్లకు మనం కచ్చితంగా దూరంగా ఉండాల్సిన అవసరం ఉందట. నోయిడాకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ పరుల్ ఖుర్రానా ఏం చెబుతున్నారంటే? కొన్ని అధ్యయనాల ప్రకారం భోజనం చేసిన తర్వాత కనీసం 5 నిమిషాల పాటు అస్సలు చేయకూడని పనులు ఉన్నాయట. అవేంటంటే?

నిద్ర
చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే కడుపు నిండా తిన్న తర్వాత బాగా నిద్ర రావడం. నిజానికి తిన్న తర్వాత నిద్ర అనేది మీకు హాయిగా అనిపిచచ్చు. కానీ ఈ అలవాటు జీర్ణక్రియకు అంతరాయ కలిగిస్తుందట. మనం తిన్న ఆహారాన్ని ప్రాసెస్ చేయడానికి శరీరానికి శక్తి అవసరం. నిద్ర పోవడం వల్ల శక్తిని నిలిచిపోతుంది. ఫలింతగా ఆహారం సరిగ్గా జీర్ణం అవదు. కాబట్టి తిన్న వెంటనే చిన్న చిన్న పనులు చేయడం, నడవడం లాంటివి చేస్తుండాలి.

ధూమపానం
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. కానీ భోజనం చేసిన తర్వాత పొగ త్రాగడం మరింత హానికరమని మీకు తెలుసా? కడుపు నిండా తిన్న తర్వాత తాగిన ఒక సిగరెట్.. పది సిగరెట్టు తాగిన దాంతో సమానమని నిపుణులు చెబుతున్నారు. తిన్న వెంటనే సిగరెట్ తాగడం జీర్ణక్రియకు ఆటంకం కలిగించి వివిధ జీర్ణశయాంతర సమస్యలకు దారితీస్తుంది. పైగా దీంట్లోని టాక్సిన్లు మనం తిన్న ఆహారాన్ని కూడా నాశనం చేస్తాయి.

వేడి నీటి స్నానం
కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా జీర్ణక్రియకు ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. తిన్న వెంటనే వేడి నీటితో స్నానం చేయడం వల్ల జీర్ణక్రియకు అవసరమైన రక్తం కడుపు నుంచి వేరే భాగాలకు మళ్లుతుంది. ఇది ఆహారం అరుగుదలను నెమ్మది చేస్తుంది. ఫలితంగా దీర్ఠకాలికంగా ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు వస్తుంటాయి.

పండ్లు తినద్దు
పండ్లలో శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు ఉంటాయి. కానీ భోజనం తర్వాత వీటిని తినడం అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే పండ్లు భిన్నంగా, వేగంగా జీర్ణమవుతాయి. ఆహారం నుంచి పోషకాలను శోషించడానికి జీర్ణక్రియకు ఇవి ఇబ్బందిగా మారతాయి. ఫలితంగా అరుగుదల సమస్యలు, ఉబ్బరం, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వీలైనంత వరకూ పండ్లను ఎప్పుడు ఖాళీ కడుపుతో లేదా భోజనం చేసిన తర్వాత కనీసం గంట తర్వాత లేదా తినడానికి గంట ముందు తినడం మేలు.

టీ తాగడం మానుకోండి
టీ అనేది చాలా మందికి ఇష్టమైన పానీయం. ఇది మంచి ఫ్రెష్, రిలాక్స్ ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ తిన్న తర్వాత టీ తాగడం వల్ల భోజనంలో ప్రోటీన్లను పొందలేదు. ఆహారంలోని ప్రోటీన్లను శోషించుకునేందుకు ఆటంకం కలిగించే ఆమ్లాలు టీలో ఉంటాయి. టీలోని టానిన్లు భోజనం నుంచి ఇనుమును శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. కాబట్టి తిన్న తర్వాత కనీసం గంట దాటాక లేక తినడానికి గంట ముందు టీ తాగడం అలవాటుగా చేసుకోండి.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

వాతావరణ మార్పులతో బ్రెయిన్​పై తీవ్ర ప్రభావం- ఉష్ణోగ్రతలతో వారికి చాలా డేంజర్! - Climate Change Impact On brain

సన్‌ స్క్రీన్‌ లోషన్‌ వాడితే విటమిన్‌-D అందదా? నిజమెంత? - Sunscreen Vitamin D Issue

ABOUT THE AUTHOR

...view details