ETV Bharat / health

ఒకేచోట కూర్చునే వాళ్లకు నడుము, మెడ నొప్పులు! - ఇలా చేయాలంటున్న నిపుణులు - DEAD BUTT SYNDROME SYMPTOMS TELUGU

- గంటల తరబడి కదలకపోతే "డెడ్​ బట్​ సిండ్రోమ్"​కు ఛాన్స్ - ఈ జాగ్రత్తలు పాటిస్తే సమస్య తగ్గుతుందట!

Over Sitting Side Effects in Telugu
Dead Butt Syndrome Symptoms (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2024, 10:08 AM IST

Dead Butt Syndrome Symptoms: ప్రస్తుత రోజుల్లో గంటల తరబడి ఒకే చోట కూర్చొని పనిచేస్తున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఉద్యోగం, వ్యాపారం చేసే వారే కాదు.. ఇంట్లో ఉండే చాలా మంది కూడా ఎక్కువసేపు కూర్చొనే ఉంటారు. అయితే ఇలా గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల నడుము, మెడ నొప్పులే కాదు.. ఎముక సాంద్రత కూడా తగ్గిపోతుందని.. ఈ దశనే ‘డెడ్‌బట్‌ సిండ్రోమ్‌’గా పేర్కొంటున్నారు నిపుణులు. గ్లూటియల్ మతిమరుపుగా పిలిచే దీని ప్రభావం.. పిరుదుల మీదే కాకుండా.. శరీర ఆకృతి పైనా ఉంటుందని చెబుతున్నారు. మరి, ఈ డెడ్​ బట్​ సిండ్రోమ్​ లక్షణాలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

డెడ్​బట్​ సిండ్రోమ్​కు కారణాలు: పిరుదుల్లో ఉండే గ్లూటియల్ కండరాలు.. కటి వలయానికి సపోర్ట్‌ను ఇస్తూనే .. శరీర ఆకృతి నిటారుగా ఉండేలా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే ఒకే దగ్గర ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఈ కండరాల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని.. తద్వారా వెన్ను, నడుం నొప్పి.. వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయని.. అలాగే పిరుదులు, కటి వలయంలోని ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుందని అంటున్నారు. ఇదే "డెడ్‌ బట్‌ సిండ్రోమ్‌"కి దారితీస్తుందని చెబుతున్నారు.

లక్షణాలు ఇవే: డెడ్‌ బట్‌ సిండ్రోమ్‌ బారిన పడిన వారిలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. అవి చూస్తే..

  • చాలాసేపు కూర్చొని లేచాక.. పిరుదులు మొద్దుబారినట్లుగా/నొప్పిగా అనిపించడం మనం గమనిస్తుంటాం. ఇదీ డెడ్‌ బట్‌ సిండ్రోమ్‌’ లక్షణమే అంటున్నారు నిపుణులు.
  • ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల నడుము, కాళ్లలోని కండరాలు, కీళ్లు బిగుసుకుపోయినట్లుగా తయారవుతాయని.. ఫలితంగా ఆయా భాగాల్లో విపరీతమైన నొప్పి వస్తుంటుందని చెబుతున్నారు.
  • గంటల తరబడి కూర్చున్నప్పుడు తుంటి కండరాల్లో వాపుతో కూడిన నొప్పి గమనించ వచ్చంటున్నారు నిపుణులు.
  • కొన్నిసార్లు మోకాళ్ల కింది భాగంలో నొప్పి వస్తుంటుంది. ఈ సిండ్రోమ్‌ కారణంగా శరీర సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఇలా జరుగుతుందని వివరిస్తున్నారు.

ఉపశమనం పొందేది ఎలా: ఇలాంటి లక్షణాలు కనిపిస్తే చాలా మంది ఇది సాధారణ సమస్యే కదా అని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఈ లక్షణాలను ఇలాగే వదిలేస్తే శరీర ఆకృతి, శరీర సమతుల్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు. అందుకే ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా.. వీటితో పాటు కొన్ని చిట్కాలూ ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయంటున్నారు.

  • పెయిన్​, వాపు వచ్చిన శరీర భాగాల్లో ఐస్​ ప్యాక్‌ పెట్టుకోవడం వల్ల తొందరగా ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
  • ఎప్పుడూ కూర్చొనే ఉండడం కాకుండా మధ్యమధ్యలో ఐదు పది నిమిషాల బ్రేక్‌ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇదే విషయాన్ని హార్వార్డ్ విశ్వవిద్యాలయ నిపుణులు కూడా చెబుతున్నారు(రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి).​ ఈ బ్రేక్​ సమయంలో వాకింగ్​ , జాగింగ్‌, మెట్లెక్కడం, దిగడం.. వంటివి సాధన చేస్తే ఈ సమస్య రాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.
  • అలాగే కూర్చున్నప్పుడూ పాదాల వద్ద ఎత్తు ఉండేలా ఏదైనా సపోర్ట్‌ పెట్టుకోవడం మంచిదంటున్నారు.
  • పిరుదుల్లోని కండరాలు దృఢంగా ఉండేందుకు హామ్‌స్ట్రింగ్‌ వ్యాయామాలు, స్క్వాట్స్‌, కాళ్లు పైకెత్తి చేసే వ్యాయామాలు.. వంటివి సాధన చేస్తే ఫలితం ఉంటుందని అంటున్నారు.
  • ఈత, డ్యాన్స్‌ చేయడం, ఆటలాడడం.. వంటివి కటి వలయం, పిరుదుల్లోని కండరాలు దృఢంగా ఉండేందుకు దోహదం చేస్తాయని.. ఫలితంగా డెడ్‌ బట్‌ సిండ్రోమ్‌ బారిన పడే అవకాశాలు తక్కువంటున్నారు నిపుణులు.
  • వాటర్ కూడా అధికంగా తీసుకోమంటున్నారు. ఫలితంగా ఎక్కువ సార్లు వాష్​రూమ్​కు వెళ్లాల్సివస్తుందని తద్వారా ఎక్కువ సేపు ఒకే దగ్గర కూర్చోవడం ఉండదంటున్నారు. అలాగే హైడ్రేట్​గా ఉండొచ్చని చెబుతున్నారు. అంతే కాకుండా చాలా మంది ఒకే దగ్గర కూర్చొని ఫోన్లు మాట్లాడుతుంటారు. అలా ఒక దగ్గరే కాకుండా నడుస్తూ మాట్లాడటం చేయమంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఫోన్​, కంప్యూటర్​తో ఊహించని సమస్యలు - మీకు ఏం జరుగుతుందో తెలుసా?

కాలు మీద కాలు వేసి కూర్చుంటున్నారా? - నిపుణులు ఏమంటున్నారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.