తెలంగాణ

telangana

ETV Bharat / health

పాలు ఏ సమయంలో తాగితే మంచిది? - ఆయుర్వేదం ఏం చెబుతోందంటే?

Best Time To Drink Milk : మనలో చాలా మంది డైలీ పాలు తాగుతుంటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం పాలు తాగడానికి కొన్ని నిర్దిష్ట వేళలు ఉన్నాయి. అలాకాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తాగితే ఆరోగ్యానికి తగిన పోషకాలు లభించవంటున్నారు నిపుణులు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

Milk
Best Time To Drink Milk

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 1:31 PM IST

Best Time To Drinking Milk As Per Ayurveda :మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. నిజానికి పాలు బలవర్ధకమైన ఆహారం. ఎందుకంటే పాలలో ప్రొటీన్లు మాత్రమే కాకుండా కాల్షియం, పోటాషియం, థయామిన్, నికోటినిక్ యాసిడ్, ఎముకలు, కండరాలను బలోపేతం చేసే అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవే కాకుండా విటమిన్ ఏ, బీ1, బీ2, బీ12, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా రోజూ శరీరానికి తగిన పోషకాలు అందుతాయనే ఉద్దేశంతో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు డైలీ ఒక గ్లాస్ పాలు(Milk) తాగమని సలహా ఇస్తారు.

అయితే పాలు తాగడం ద్వారా అందులో ఉండే పోషకాలన్నీ లభించాలంటే.. అవి ఏ టైమ్​లో తాగితే మంచిది అనే విషయం కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. వాస్తవానికి పాలు ఎప్పుడూ తీసుకున్నా ఆరోగ్యకరమే. కానీ, ఆయుర్వేదం ప్రకారం.. రోజులో పాలు తాగడానికి కొన్ని నిర్దిష్ట వేళలు ఉన్నాయి. అలాగే పాలు సాత్వికాహారం.. కాబట్టి దానికి అనుగుణంగా తీసుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ పాలు తీసుకోవడానికి మంచి సమయం ఏది? ఏ టైమ్​లో తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఉదయం పూట :మనలో చాలా మంది ఎక్కువగా ఉదయం పూట పాలు తాగుతుంటారు. మార్నింగ్ మిల్క్ తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తి అందించడంతో పాటు తగిన పోషణ లభిస్తుంది. అదే విధంగా బరువు పెరగాలనుకుంటే పాలు ఉత్తమమైన ఆహారమని ఆయుర్వేదం చెబుతోంది. ఒకవేళ ఉదయం పూట పాలు తాగిన తర్వాత అలసటగా, మబ్బుగా అనిపించినా, ఎసిడిటీ వంటి ప్రాబ్లమ్స్ తలెత్తినా.. మార్నింగ్ పూట పాలు తాగకపోవడం మంచిదంటున్నారు.

మధ్యాహ్న సమయం :కొందరు మధ్యాహ్నం సమయంలో పాలు తాగుతుంటారు. అయితే ఈ టైమ్​లో మిల్క్ తీసుకోవడం వల్ల మీరు దృఢంగా ఉంటారని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే మీ ఆకలిని మెరుగుపరుస్తుంది. కిడ్నీల్లో స్టోన్స్, మూత్రవిసర్జనలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు మధ్యాహ్నం సమయంలో పాలు తాగితే మంచిదట. ముఖ్యంగా పిల్లలు ఈ సమయంలో పాలు తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.

మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? - ఇప్పుడే చెక్ చేసుకోండిలా!

రాత్రిపూట : చాలా మంది ఉదయం తప్పితే రాత్రి పూట పాలు ఎక్కువగా తాగుతుంటారు. నిజానికి నైట్​ టైమ్​ మిల్క్ తీసుకోవడం ద్వారా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయి. ముఖ్యంగా రాత్రిపూట పాలు తాగితే.. శరీరంలో మూడు దోషాలు(వాత, పిత్త, కఫ) సమతుల్యం అవుతాయట. అలాగే నిద్రపోవడానికి కనీసం అరగంట ముందు పాలు తాగడం మంచిది. అలాగే డిన్నర్​, పాలు తాగడానికి మధ్య తగినంత టైమ్​ ఉండేలా చూసుకోవాలి. రాత్రిపూట పాలు తాగడం ద్వారా అందులో ఉండే సెరోటోనిన్ కంటెంట్ మంచి నిద్రను పొందేలా చేస్తుంది.

అయితే ఆయుర్వేదం ప్రకారం.. చల్లారిన పాలు ఆరోగ్యానికి అంత మేలు చేయవు. కాబట్టి ఎప్పుడూ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. అదే విధంగా జ్వరం, అజీర్ణం, దగ్గు, బాడీలో కఫం దోషం పెరిగినా, విరేచనాలు, కొన్ని చర్మవ్యాధులు, పేగులో పురుగులు వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లయితే... రాత్రి పాలు తాగకూడదనే విషయం గుర్తుంచుకోవాలి.

పాలను ఎప్పుడూ ఇలా తాగకూడదు..

  • ఆయుర్వేదం ప్రకారం.. పాలతో ఎప్పుడూ మిల్క్‌ షేక్‌లు, జ్యూస్‌లు తయారు చేసుకుని తాగొద్దు. ఎందుకంటే మిల్క్​షేక్​లు ఆరోగ్యానికి అంత మంచివి కావు.
  • అదేవిధంగా సిట్రస్‌ పండ్లతో కలిపి పాలు తీసుకోకూడదు.
  • ముఖ్యంగా చాలా మంది చేసే పొరపాటు ఖాళీ కడుపుతో పాలు తాగుతుంటారు. కానీ, అలా తాగకూడదంట.
  • మిల్క్, ఉప్పగా ఉండే ఆహార పదార్థాలను ఎప్పుడూ కలిపి తీసుకోకూడదు.
  • అలాగే అల్లోపతి మందులతో కలిపి పాలు తాగకూడదు.

ఈజీగా బరువు తగ్గాలా? రోజూ ఆ పాలు తాగితే బెస్ట్!

చల్లటి పాలు- ఎసిడిటీకి తిరుగులేని మందు! ఇలాంటి మరో 6 చిట్కాలు మీకోసం!

ABOUT THE AUTHOR

...view details