What is Saree Cancer: భారతీయ మహిళలు అత్యధికంగా ధరించే వస్త్రాల్లో.. చీరది మొదటి స్థానం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా మెజారిటీ మహిళలు ప్రతిరోజూ చీరలే కట్టుకుంటారు. అయితే.. ఇప్పుడు వారు వస్త్రధారణను సవరించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు నిపుణులు! చీర కట్టుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి.. ఇది నిజమేనా? చీరకు క్యాన్సర్ కు సంబంధం ఏంటి..? ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
చీర క్యాన్సర్ అనేది చాలా అరుదైన స్కిన్ క్యాన్సర్. ఇది చీర ధరించే స్త్రీలలో నడుము చుట్టూ వస్తుందట. ఎందుకంటే.. చీర కట్టుకునే ముందు లోపల లంగా ధరిస్తారు. ఈ లంగాను బొందుతో గట్టిగా చుట్టి నడుము చుట్టూ బిగిస్తారు. రోజూ ఇలాగే చేస్తుంటారు. దీంతో కొన్నేళ్ల తర్వాత ఆ భాగంలో చర్మం నల్లగా మారి ఊడిపోవడం మొదలవుతుంది. దురద కూడా మొదలవుతుంది. ఈ లక్షణాలను పట్టించుకోకపోతే క్యాన్సర్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దిల్లీకి చెందిన ఆంకాలజిస్ట్ డాక్టర్ వివేక్ గుప్తా చెబుతున్నారు.
కేవలం చీర కట్టుకునే వారికే కాకుండా బిగుతుగా ఉండే బట్టలు ధరించే వారిలోనూ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. చీర కట్టు క్యాన్సర్ వ్యాప్తికి వస్త్రం కంటే అపరిశుభ్రత పద్ధతులే ఎక్కువగా కారణమంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, తేమ స్థాయిలు ఉన్న ప్రాంతాల్లోనూ ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. వైద్య పరిభాషలో దీన్ని స్క్వామస్ సెల్ కార్సినోమా (SCC) అని అంటారట.
అలర్ట్ : నోట్లో ఈ సమస్యలుంటే - షుగర్ ముప్పు ఉన్నట్టే! - Diabetes Warning Signs