Vegetarian Food Mistakes :క్షణం తీరిక లేకుండా సాగిపోతున్న నేటి జీవితంలో కేవలం త్వరగా, రుచిగా తినాలి అనుకుంటున్నారే తప్ప ఆరోగ్యంగా తినాలి అనుకువే వాళ్లు తక్కువ. చాలా మంది ఆరోగ్యాన్ని పక్కకు పెట్టి, రుచి మీదనే దృష్టి పెడుతూ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం తూచా తప్పకుండా కఠినంగా డైట్ ఫాలో అవుతూ కేవలం వెజ్ మాత్రమే తింటూ జాగ్రత్తగా ఉంటున్నామని అనుకుంటున్నారు. వాళ్లే వెజిటేరియన్లు. అయితే వెజ్ మాత్రమే తింటున్నాం. ఆరోగ్యంగా ఉంటున్నాం అనుకుంటూనే వారికే తెలియకుండానే చాలా పెద్ద తప్పులు చేస్తున్నారట వెజిటేరియన్లు. వెజ్ మాత్రమే తీసుకోవాలనే తపనతో న్యూట్రియస్ ఫుడ్‌కు దూరమవుతుండటం బాధకరమైన విషయం. మీరూ వెజిటేరియన్ అయి ఉంటే నాన్ వెజ్ అస్సలు ముట్టకూడదనుకుంటే ఈ సూచనలు పాటించి ప్రొసీడ్ అవ్వండి.
డైరీ ప్రొడక్టులు
వెజిటేరియన్లు చాలా నమ్మకంగా, ఆరోగ్యంగా ఉంటుందని యోగర్ట్ తీసుకుంటుంటారు. కానీ, యోగర్టులన్నీ ఒకటి కాదు. చాలా వరకూ షుగర్ మిక్స్ చేసి ఉంటాయి. అందులో బెస్ట్ చూసి తీసుకోవాలి.
ప్రొటీన్లు
శరీరం ఎదుగుదలకు లేదా రికవరీకి ప్రొటీన్లు అనేవి చాలా ముఖ్యం. ఇది దృష్టిలో పెట్టుకుని చాలా మంది వెజిటేరియన్లు ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటారు కానీ, అవి ఒకేసారి తీసుకోవడం కంటే ప్రతి రోజు తమ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
ఫ్రూట్స్ తినడం
చాలా మంది తమ ఆహారంలో స్నాక్స్‌కు బదులు ఫ్రూట్స్ తింటుంటారు. ఇలా కేవలం ఫ్రూట్ మాత్రమే స్నాక్‌గా తీసుకోవడం వల్ల ఆకలి అనేది ఇంకా పెరిగిపోతుంది.
వెరైటీలకు దూరం
వెజిటేరియన్లు ఒక ఫిక్స్‌డ్ ఫుడ్‌కు అలవాటుపడి ఎక్కువ వెరైటీలను తీసుకోరు. చాలా మొక్కల్లో ఎమినో యాసిడ్లు తక్కువ. మరి మీరు తీసుకునే ఆహారంలో ఎమినో యాసిడ్లు ఉంటున్నాయా అని ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
విటమిన్ బీ-12లోపం
ఒక్కసారిగా నాన్ వెజ్ మానేసినా లేదా పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటున్నా మీ ఆహారంలో విటమిన్ బీ-12 సమతుల్యంగా ఉందా అని చెక్ చేసుకుంటుండాలి. ఒక కప్పు పాలు, ఒక గుడ్డు కలిపి తీసుకుంటే ఒక్క రోజుకు సరిపడా అంటే 2/3వ వంతు విటమిన్ బీ-12 అందుతుంది.