ETV Bharat / health

నల్లద్రాక్షతో గుండె జబ్బులు, క్యాన్సర్​కు చెక్- కానీ వారు మాత్రం ఎక్కువగా తినకూడదట - BLACK GRAPES BENEFITS FOR HEALTH

-నల్ల ద్రాక్షలో అనేక పోషకాలు ఉన్నాయని నిపుణుల వెల్లడి -మలబద్ధకం, ఊబకాయం ముప్పును తగ్గిస్తుందట!

black grapes benefits for health
black grapes benefits for health (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Jan 23, 2025, 12:58 PM IST

Black Grapes Benefits for Health: ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ముఖ్యంగా నల్లద్రాక్ష తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని అంటున్నారు. దీని వల్ల క్యాన్సర్​, గుండె జబ్బులు లాంటి సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఇందులో రెస్వరట్రాల్, ఫ్లేవనాయిడ్స్, ఆంథోసయనిన్స్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదింప చేస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నల్ల ద్రాక్షతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె సమస్యలు: ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్‌ సి రోగనిరోధక వ్యవస్థను బలంగా తయారు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్‌ రక్త ప్రసరణను మెరుగు పరిచి హృదయ వ్యాధుల ముప్పును తగ్గిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా నల్ల, ఎర్ర ద్రాక్ష తొక్కలో ఉండే రెస్వరట్రాల్‌ వల్లనే గుండెకు మేలు చేసే లక్షణాలు వస్తాయని పరిశోధకుల భావిస్తున్నారు. 2018లో Journal of Nutritionలో ప్రచురితమైన "Consumption of Black Grape Extract Reduces Inflammation and Improves Cardiovascular Health in Healthy Adults" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

అల్జీమర్స్‌ నివారణ: అల్జీమర్స్‌ వ్యాధి పురోగతిని తగ్గించడంలో రెస్వరట్రాల్‌ దోహదం చేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇంకా జ్ఞాపకశక్తిని, మెదడు పని తీరును మెరుగు పరుస్తుందని వివరిస్తున్నాయి.

చర్మం: ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో ఎంతగానో సహాయ పడతాయని చెబుతున్నారు.

క్యాన్సర్‌ తగ్గించే అవకాశాలు: ఇందులో పుష్కలంగా ఉండే రెస్వరట్రాల్‌ క్యాన్సర్‌ పెరుగుదలను తగ్గించినట్లు పరిశోధనల్లో వెల్లడైంది. 50 ఏళ్ల పైబడిన వారు రెండు వారాలు రోజూ ద్రాక్షను తినడం వల్ల వారిలో పెద్దపేగు కేన్సర్‌ ప్రమాద సూచికలు తగ్గినట్లు పరిశోధనల్లో గుర్తించారు.

మలబద్ధకం, ఊబకాయంపై పోరు: రెస్వరట్రాల్, ప్టీరోస్టిల్బెన్‌ ఒబెసిటీని నియంత్రించడంలో సహాయ పడతాయని నిపుణులు చెబుతున్నారు. ద్రాక్షలోని ఫైబర్‌ జీర్ణ క్రియను మెరుగుపరిచి.. మలబద్ధకాన్ని నివారిస్తుందని చెబుతున్నారు.

ఎముక పుష్ఠి: ద్రాక్షలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్‌ ఎముకలను బలంగా ఉంచుతాయని అంటున్నారు. విటమిన్‌ ఎ రోగ నిరోధక శక్తికి తోడ్పడుతుందని చెబుతున్నారు. కణాల ఎదుగుదలకు, కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తుందని వివరిస్తున్నారు. అనారోగ్యాల నుంచి త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.

పోషకభరితం: నల్ల ద్రాక్షలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో 82% నీరు ఉంటుందని.. వీటిలో అతి తక్కువ కాలరీలు ఉండటానికి అదే కారణమని వివరిస్తున్నారు. 31 క్యాలరీలు, కార్బో హైడ్రేట్లు 8 గ్రాముల, చక్కెరలు 7 గ్రాములు ఉంటాయని.. ఎలాంటి కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండదని చెబుతున్నారు. ఇంకా ఇందులో పొటాషియం, విటమిన్ సి, కే, మెగ్నీషియం, రాగి, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయని వివరిస్తున్నారు.

అయితే, నల్ల ద్రాక్షలు మంచివన్నారు కదాని ఎక్కువ తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రక్త స్రావ సమస్యలున్న వారు, శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్న వారు పరిమితంగా తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కొబ్బరి నూనెతో లేడీస్ ప్రాబ్లమ్​కు చెక్- సింపుల్ టిప్స్ పాటిస్తే హర్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయట!

'జీరా వాటర్ తాగితే షుగర్ కంట్రోల్'- ఇంకా బరువు కూడా తగ్గుతారని పరిశోధనలో వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.