Hormonal Imbalance in Women: ప్రస్తుతం చాలామంది మహిళలు ఎదుర్కొంటోన్న సమస్య హార్మోన్ల అసమతుల్యత. దీనివల్ల అధిక బరువు, బద్ధకం, నిద్ర పట్టకపోవడం, నెలసరి సంబంధిత సమస్యలు వంటివి తలెత్తుతుంటాయని నిపుణులు అంటున్నారు. అయితే, ఇలా జరగకుండా హార్మోన్లను సమతులంగా ఉంచుకోవాలంటే ఈ చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫైబర్ ఎక్కువగా!
హార్మోన్లను సమతులంగా ఉంచుకోవడానికి మనం తీసుకునే ఆహారంలో కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు తగినంత మొత్తంలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కాయగూరలు, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇది రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని సమన్వయపరుస్తుందని వివరిస్తున్నారు. అలాగే ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి, యాపిల్, జామ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుందని అంటున్నారు.
కొబ్బరి నూనెతో
హార్మోన్ల సమతుల్యతకు కొబ్బరి నూనె సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా శరీరంలో వివిధ హార్మోన్ల స్థాయుల్ని ఇది క్రమబద్ధీకరిస్తుందని వివరిస్తున్నారు. అందుకే ఈ నూనెతో వంటకాలు చేసుకొని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే బరువును అదుపులో ఉంచుకునేందుకూ ఈ చిట్కా ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు.
వెజిటబుల్ ఆయిల్స్
మన శరీరంలో కొవ్వుల పాత్ర చాలానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో హార్మోన్ల ఉత్పత్తికి, వివిధ కణాలు తిరిగి నిర్మితమవడానికి కొవ్వులు ఎంతో ఉపయోగపడతాయని వివరిస్తున్నారు. వెజిటబుల్ ఆయిల్స్‌లో అధిక మొత్తంలో ఉండే పాలీశ్యాచురేటెడ్ కొవ్వులు ఈ పనుల్ని సమర్థంగా నిర్వర్తిస్తాయని అంటున్నారు. కాబట్టి వంటకాల్లో ఈ నూనెల్ని వాడటం మంచిదని సలహా ఇస్తున్నారు.
కాఫీ మితంగా!
చాలా మంది అలవాటైందనో లేక ఇష్టమనో పదే పదే కాఫీ తాగుతుంటారు. కానీ, కాఫీ ఎక్కువగా తాగడం వల్ల కూడా హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి దీన్ని మితంగా అంటే రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల చొప్పున తీసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. ఇంకా వీటితో పాటు రోజూ ఎనిమిది గంటల సుఖ నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వల్ల కూడా హార్మోన్లను సమతులంగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. 2019లో Journal of Women's Healthలో ప్రచురితమైన "Lifestyle Modifications for Hormonal Imbalance in Women" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'జీరా వాటర్ తాగితే షుగర్ కంట్రోల్'- ఇంకా బరువు కూడా తగ్గుతారని పరిశోధనలో వెల్లడి
ఈ నూనె రాస్తే కీళ్ల నొప్పులు తగ్గిపోయే ఛాన్స్! వంటల్లో వాడితే గుండెకు మంచిదట!