ETV Bharat / state

హెచ్ఎండీఏ మహాప్రణాళిక 2050 - హైదరాబాద్ దశ మార్చనున్న ఆ మూడే అత్యంత కీలకం - HMDA HYDERABAD MASTER PLAN 2025

త్వరలో హైదరాబాద్ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌-2050 - ముసాయిదా విడుదలకు చర్యలు మొదలు - ముమ్ముర కసరత్తు చేస్తున్న హెచ్‌ఎండీఏ

HMDA Master Plan For Hyderabad Development
HMDA Master Plan For Hyderabad Development (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2025, 2:22 PM IST

HMDA Master Plan For Hyderabad Development : వచ్చే 25ఏళ్లు హైదరాబాద్‌ మహానగర అవసరాలను దృష్టిలో ఉంచుకొని బృహత్తల ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్)-2025కు హెచ్‌ఎండీఏ ముమ్మర కసరత్తు చేస్తోంది. 3-4 నెలల్లో ముసాయిదా విడుదలకు సన్నహాలు చేస్తోంది. అనంతరం ఆయా జిల్లాల మండల స్థాయిల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ దాదాపు మూడు నెలల పాటు జరిగే అవకాశముంది. ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు, చేర్పుల పరిశీలించిన తర్వాత పూర్తి మాస్టర్‌ప్లాన్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈ సంవత్సరం చివరి నుంచి కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చే అవకాశముందని హెచ్‌ఎండీఏ అధికారి తెలిపారు.

ఇప్పుడు ఇలా : ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐదు మాస్టర్‌ప్లాన్‌లు అమల్లో ఉన్నాయి. పాత బల్దియా, జీహెచ్‌ఎంసీ, ఎయిర్‌పోర్టు అథారిటీ, సైబరాబాద్‌ డెవలప్‌మెంట్ అథారిటీ, విస్తరిత ప్రాంతాల అభివృద్ధి ప్లాన్ -2023 ఉన్నాయి. కొన్నిసార్లు ఒక ప్రాంతం రెండు మాస్టర్ ప్లాన్‌లో పరిధిలోకి వస్తుండడంతో రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 2030 మాస్టర్‌ప్లాన్‌లో తప్పుల కారణంగా చాలా ప్రాంతాల్లో అభివృద్ధి అనుకున్నంత మేర సాగడం లేదు. ఎన్‌వోసీల కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గూగుల్‌ మ్యాపులు, స్థానిక రెవెన్యూ మ్యాపులు, గ్రామాల మ్యాపులు, ఎన్‌జీఆర్‌ఐ, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ను తీసుకొని కొత్త సాంకేతిక విధానంతో తప్పులకు ఆస్కారం లేకుండా రూపొందించడానికి కసరత్తు చేస్తున్నారు. ఇక నుంచి ఒకటే మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా ఆయా స్థానిక సంస్థలు, ఇతర అథారిటీలు తమ ప్రణాళికలు రూపకల్పన చేయనున్నాయి.

వంద దాటనున్న జోన్లు :

  • విస్తరిత ప్రాంతంలో 2050 వరకు ఎలాంటి సౌకర్యాలుండాలి. రహదారుల అనుసంధానం నుంచి రెసిడెన్షియల్ జోన్లు, పారిశ్రామిక జోన్లు, అర్బన్‌ నోడ్లు, గ్రీన్ జోన్లు, గ్రిడ్ రోడ్లు ఎక్కడెక్కత ఎంతెంత ఉండాన్న విషయం పొందుపర్చనున్నారు.
  • ఏడు జిల్లాలో పరిధిలో మహానగర విస్తరిత ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని 2030 అవసరాల కోసం 2008లో మాస్టర్‌ ప్రాన్‌ను హెచ్‌ఎండీఏ రూపకల్పన చేసింది. అప్పట్లో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదు ఇప్పుడు అదే మహానగర అభివృద్ధికి ఆటంకంగా మారుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
  • అన్ని రకాల జోన్లను పెంచనున్నారు. స్థానిక జోన్‌ కార్యాలయాలు పెరగనున్నాయి. ప్రస్తుతం ఆరు జోన్లను పదికిపైగా పెంచడంతోపాటు అదనపు సిబ్బందిని నియమించే అవకాశం ఉందన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ పరిధి దాటి ప్రణాళిక :

  • హైదరాబాద్ మహానగర్ ప్రణాళిక -2030లో ఏడు జిల్లాల పరిధి మాత్రమే ఉంది. కొత్త ప్రణాళికలో ప్రాంతీయ రింగు రోడ్డు దాటి విస్తరించనున్నారు.
  • ప్రస్తుతం 7,257 చదరవు కిలోమీటర్ల కంటే విస్తీర్ణం పెరగనుంది. కొత్తగా 4 జిల్లాలు, 32 మండలాలు హెచ్‌ఎండీఏలో చేరనున్నాయని వివరిస్తున్నారు. దాదాపు 13వేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది.
  • హైదరాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేటతో పాటు కొత్తగా నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ పలు మండలాలను చేర్చనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 74 మండలాలు ఉండగా వాటి సంఖ్య వంద దాటనుందని ఓ అధికారి తెలిపారు.

ఈ మూడింటిపై ప్రతేక ఫోకస్ :

  • కొత్త మాస్టర్‌ ప్లాన్‌లో మూడు అంశాలు (ప్రజారవాణా, నీటివనరులు, పెట్టుబడులకు అనుగుణంగా ప్రత్యేకంగా జోన్లు)కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
  • ఓఆర్ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య రేడియల్, గ్రిడ్‌ రోడ్లు, అంతర్గత రహదారుల అభివృద్ధి, మెట్లో సేవల విస్తరణకు ప్రాధాన్యం కల్పించనున్నారు.
  • జాతీయ రహదారులు, విమానాశ్రయంతో అనుసంధానం, జనాభాకు అనుగుణంగా ప్రజారవాణాను పటిష్ఠం చేసేందుకు మొబిలిటీ ప్లాన్‌లో వివిధ సూచనలు ఇవ్వనున్నారు.
  • పారిశ్రామిక కారిడార్లు, వర్క్‌ ఫోర్స్, కొత్త పరిశ్రమల స్థాపనకు కావాల్సిన మౌలిక వసతులు ఇలా ఆర్థికంగా పురోగతి సాధించడానికి కావాల్సిన అన్ని అంశాలను ప్లాన్‌లో చర్చించనున్నారు.
  • ఇప్పటి నుంచి వచ్చే 25ఏళ్లకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో 3600 చెరువులున్నాయి. ఇవి ఆక్రమణలకు గురికాకుండా బ్లూ అండ్‌ గ్రీన్‌ పేరుతో ప్రత్యేక ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది.

కోకాపేట నుంచి ఓఆర్​ఆర్​కు ప్రత్యేక రోడ్డు - ఆ 24 ఎకరాలకు భారీ డిమాండ్

చెరువుల కబ్జాలకు ఇక నుంచి ఫుల్​స్టాప్!​ - అంగుళం ఆక్రమించినా ప్రభుత్వానికి తెలిసిపోద్ది!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.