Unknown Benefits of Toothpaste: మనం నిత్యం ఉపయోగించే వస్తువులో టూత్ పేస్ట్ కూడా ఒకటి. దంతాలను శుభ్రం చేయడానికి దీనిని ఉపయోగిస్తారని అందరికీ తెలిసిన విషయమే. తాజా శ్వాస, ఆరోగ్యకరమైన దంతాలు, బలమైన చిగుళ్ల కోసం ఈ టూత్‌పేస్ట్ను ఉపయోగిస్తారు. అయితే ఈ టూత్ పేస్ట్ మన దంతాలను శుభ్రం చేయడానికే కాకుండా అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మెహందీ తొలగించడానికి:పెళ్లి, పండుగ.. ఇలా వేడుకేదైనా ఆడపిల్లల చేతులకు గోరింట పండాల్సిందే. డిజైన్లు వేసుకునే వీలుంటుందని మెహెందీలను ఆశ్రయిస్తారు. కోన్ పెట్టిన కొన్నిరోజులు చేతులు అందంగానే ఉంటాయి. ఆ తర్వాతే పొట్టులా రాలుతూ చిరాకు పెడతాయి. అయితే ఈ సమస్యను టూత్‌పేస్ట్‌తో తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. మెహెందీ ఉన్నచోట టూత్‌పేస్ట్ను పలుచని పొరలా రాసి, ఆరనివ్వాలి. తర్వాత తడి క్లాత్‌తో తుడిచేస్తే సరి. టూత్‌పేస్ట్‌లోని రసాయనాలు హెన్నా రంగును మాయం చేయటంలో సాయపడతాయి.
మొటిమలకు:చాలా మందిలో మొటిమల సమస్య ఉంటుంది. అయితే మొటిమలను తగ్గించడంలో టూత్‌పేస్ట్ సాయపడుతుందని నిపుణులు అంటున్నారు. మొటిమలు ఉన్న చోట చేతివేళ్ల సహాయంతో నేరుగా టూత్‌పేస్ట్ అప్త్లె చేసి అరగంట పాటు ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకొని మైల్డ్ ఫేస్‌వాష్ ఉపయోగించి ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా మొటిమల చుట్టూ ఉండే చీము త్వరగా తగ్గుముఖం పట్టి వాపు తగ్గుతుందని అంటున్నారు. అలాగే టూత్‌పేస్ట్‌లో ఉండే ట్రైక్లోసాన్ మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాతో పోరాడి అవి పూర్తిగా తగ్గిపోయేలా చేస్తుందని.. ఫలితంగా తక్కువ సమయంలోనే మొటిమలపై ఇది చక్కని ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు.
మొండి మరకలు:మొండి మరకలు ఓ పట్టాన వదలదు. అలాంటప్పుడు టూత్‌పేస్ట్ను ఉపయోగించడం వల్ల ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. గోడలపై గీసిన క్రేయాన్ గీతలు, రంగులు, ఆహార పదార్థాల మరకలపై కాస్తంత టూత్‌పేస్ట్ రాసి కాసేపాగి తడి వస్త్రంతో తుడిస్తే మరకలు పోతాయని అంటున్నారు. అలాగే షూస్‌పై పడిన మరకలనూ ఇది వదలగొడుతుందని చెబుతున్నారు.
డై మరకలు:డై వల్ల చర్మంపై పడిన మచ్చల్ని కూడా టూత్‌పేస్ట్ తొలగిస్తుందని అంటున్నారు. ఇందుకోసం టూత్‌పేస్ట్‌ని కొద్దిగా తీసుకొని దాన్ని మచ్చ పడిన చోట అప్త్లె చేయాలి. ఆపై కాటన్ ప్యాడ్ లేదా సాఫ్ట్ టూత్‌బ్రష్‌తో నెమ్మదిగా పది నిమిషాల పాటు రుద్దాలి. ఇప్పుడు గోరువెచ్చటి నీటిలో ముంచిన కాటన్ వస్త్రంతో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తే మచ్చ తొలగిపోతుందని అంటున్నారు.