తెలంగాణ

telangana

ETV Bharat / health

మానసిక ఆరోగ్యంపై అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ దెబ్బ! - మీరు ఇవి తింటున్నారా?

Ultra Processed Food Side Effect: మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుతం చాలా మంది అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ తీసుకుంటున్నారు. అయితే.. ప్రాసెస్ చేసిన ఫుడ్ తినడం వల్ల ఎన్నో శారీరక సమస్యలతోపాటు మానసిక ఆరోగ్యంపైనా తీవ్రమైన ప్రభావం పడుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Ultra Processed Food Side Effect
Ultra Processed Food Side Effect

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 5:32 PM IST

Ultra Processed Food Side Effect:మనిషి రోజూ వారి జీవితంలోనే కాదు.. తిండి విషయంలోనూ చాలా మార్పులు వచ్చాయి. పలు రకాల స్నాక్స్, ప్యాక్ చేసిన చిరుతిళ్లు, స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, రెడీ టూ మీల్స్ వంటివి ఫుల్లుగా లాగిస్తున్నారు. దాదాపుగా ఇవన్నీ.. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. వీటివల్ల శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందని ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేశాయి. అయితే.. మెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెబుతున్నారు నిపుణులు!

2023లో జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్​.. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ గురించి ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది. ఇవి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొంది. అమెరికాలో జనాలు తినేది దాదాపు 60% అల్ట్రా-ప్రాసెస్ ఫుడ్డేనని తేల్చింది. ఇక పిల్లల ఏకంగా 70% ఈ తిండినే తింటున్నారట! చాలావరకు వెస్ట్రన్ ఫుడ్​నే మన దగ్గర కూడా తింటున్నారు. ఈ నేపథ్యంలో అలర్ట్​ ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫుడ్ పాయిజన్​ కాకుండా ఉండాలా? - ఈ జాగ్రత్తలు మీ మైండ్​లో ఉండాల్సిందే!

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌గా దేనిని పరిగణిస్తారు?:ప్రతి ఒక్కరూ తమ రుచులు, అభిరుచుల మేరకు ఆహారాన్ని తయారు చేసుకుంటారు. దీన్ని ఫుడ్​ ప్రాసెసింగ్ అంటారు. అయితే ‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి మన కిచెన్లో తయారయ్యే స్నాక్స్​ లాంటివి కావు. ప్యాకేజ్డ్ చిప్స్, బిస్కెట్స్​, చాక్లెట్స్, బ్రెడ్స్ మొదలైనవి అల్ట్రా ప్రాసెస్డ్​ ఫుడ్స్​. ఉదాహరణకు.. మనం పాల నుంచి పెరుగు తయారు చేస్తే దాన్ని ప్రాసెసింగ్ అంటారు. కానీ ఆ పెరుగుకు రుచి తెప్పించేందుకు రసాయనాలు, కృత్రిమ రుచులు, ప్రొటీన్ ఐసోలేట్లు, హైడ్రోజనేటెడ్ నూనెలు, అధిక-ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ లాంటివి జతచేస్తే దానిని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు. అయితే ‘ఈ పదార్థాలన్నీ జత చేయడం వల్ల అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌లో పోషక విలువలేవీ పెరగవు.

షుగర్‌ ఉన్నవారు పెరుగు, సాల్ట్ తీసుకుంటే ఏమవుతుంది? - ఆయుర్వేద నిపుణులేమంటున్నారు?

ఇవి మానసిక ఆరోగ్యానికి ఎందుకు హానికరం? :ఈ ఫుడ్స్​కు మన ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం ఉందని.. వీటి అధిక వినియోగం వల్ల డిప్రెషన్‌ మాత్రమే కాదు అంతకు మించి మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని "జర్నల్​ ఆఫ్​ ఎఫెక్టివ్​ డిజార్డర్స్" ప్రచురించింది. ఈ సమస్యల్లో మానసిక వేదన, నిస్సత్తువ, ఆకలి మందగింపు వంటివి సంభవించే ప్రమాదం ఉందని అధ్యయనం తెలిపింది. ఈ ఫుడ్స్ తీసుకునే వారు నిరాశకు గురయ్యే అవకాశం 23% ఎక్కువగా ఉందని ఆస్ట్రేలియన్ పరిశోధకులు కనుగొన్నారు.

  • ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. బ్రెజిల్‌లో 2022లో దేశంలోని 11,000 మంది పెద్దలపై ఓ అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశోధనలో అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఐక్యూ దెబ్బతింటుందని తేలింది.
  • అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాలు అధిక కేలరీలు, ఉప్పు, చక్కెర, కొవ్వును కలిగి ఉంటాయి. అలాగే ఫైబర్ కంటెంట్​ తక్కువగా ఉంటుంది. దీని కారణంగా బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
  • ముందుగా ప్యాక్ చేసిన ఆహారాలు మన గట్ బ్యాక్టీరియాను ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా మధుమేహం, రక్తపోటు, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధుల సహా క్యాన్సర్, అకాల మరణం వచ్చే ముప్పు కూడా ఏర్పడుతుందట.

మీ పిల్లలు జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తింటున్నారా ? ఇలా చేస్తే పూర్తిగా మానేస్తారు!

నివారణ మార్గం ఎలా: అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తినే అలవాటును మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వారంలో నాలుగుసార్లు మీరు అలాంటి ఆహార పదార్థాలను తింటుంటే క్రమంగా వాటిని తగ్గించుకోవాలంటున్నారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పోషకమైన ప్రోటీన్‌లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మానసిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సాయపడతాయని పేర్కొన్నారు.

Alert : బ్రేక్​ఫాస్ట్​లో ఈ ఆహారాలు - క్యాన్సర్​ వచ్చే అవకాశం!

ABOUT THE AUTHOR

...view details