తెలంగాణ

telangana

ETV Bharat / health

మీరు ఈ మెడిసిన్లు​ వాడుతారా? అయితే దానిమ్మను అస్సలు తినొద్దు- చాలా ఎఫెక్ట్స్! - Side Effects Of Pomegranate - SIDE EFFECTS OF POMEGRANATE

Things To Avoid When Eating Pomegranate : దానిమ్మ పండంటే మీరు చాలా ఇష్టమా? ఆరోగ్యానికి మంచిదే కానీ మీరు కొన్ని మెడిసిన్లు వాడుతున్నట్లయితే దానిమ్మ పండు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే?

Things To Avoid When Eating Pomegranate
Pomegranate (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 7:20 AM IST

Things To Avoid When Eating Pomegranate : అన్ని సీజన్లలోనూ మార్కెట్లో లభించే పండ్లలో దానిమ్మపండు ఒకటి. ఎర్రటి గింజలతో తియ్యటి రుచి కలిగి ఉండే దానిమ్మను నేరుగా తినడమే కాకుండా సలాడ్​లు వంటి ఇతర పదార్థాల్లోనూ కలిపి తింటుంటాం. నిజానికి దానిమ్మపండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలోని ఫ్లేవనాయిడ్లు, ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని, రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి సహాయపడతాయి.

వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఆర్థరైటిస్ సమస్యలను నయం చేయడంలోనూ దానిమ్మ చక్కగా సహాయపడుతుంది. అంతేకాదు దానిమ్మ గింజల సారం ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటుంది. సంతానం లేని వారు వీటిని తరచుగా తినడం వల్ల సంతానోత్సత్తి అవకాశాలు పెరుగుతాయట. ఇలా రకరకాలుగా ఆరోగ్యానికి మేలు చేసే దానిమ్మ పండు కొన్ని దుష్ప్రభావాలకు కూడా దారితీస్తుందట.

దానిమ్మను ఎక్కువగా తినడంవల్ల కొందరిలో అతిసారం సమస్య వస్తుంది. దురద, వాపు వంటి అలెర్జీ లక్షణాలను అభివృద్ధి చేస్తుంది. ఉదయం, మధ్యాహ్నం ఇలా ఎప్పుడు తిన్నా కూడా రోజుకు అరకప్పు దానిమ్మ గింజలు తింటే చాలనీ అంతకు మించి తింటే ఈ దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ దీన్ని కొన్ని పండ్లు, మెడిసిన్​లతో కలిపి తింటే ఇబ్బందులకు దారితీస్తుందట. అవేంటంటే?

తియ్యటి పండ్లు:
దానిమ్మపండ్లలో యాసిండ్ తక్కువ మొత్తంలో ఉంటుంది. కనుక వీటిని అరటిపండు లాంటి తియ్యటి పండ్లతో కలిపి తినకూడదు. వీటి కలయిక జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది.

వార్ఫరిస్:
2018లో జర్నల్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ అనాలిసిస్‌లో ప్రచురితమైన ఒక పరిశోధన ప్రకారం దానిమ్మ వార్ఫరిన్‌తో సంకర్షణ చెందుతుంది. ఇది వార్ఫరిస్ (రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రించేందుకు ఉపయోగించే మందు: బ్లడ్ తిన్నర్) ఈ ట్యాబ్లెట్టు వాడుతున్న వారు దానిమ్మను తింటే రక్తం గడ్డకట్టడాన్ని రెట్టింపు చేస్తుంది.

నైట్రెండిపైన్:
ఇది అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఉపయోగించే కాల్షియం ఛానల్ బ్లాకర్. ఈ ఔషధాన్ని ఉపయోగించే వారు దానిమ్మ పండును తిన్నా రసాన్ని తాగినా పేగుల జీవక్రియ తగ్గుతుంది.

స్టాటిన్:
స్టాటిన్స్ అనేది LDL కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సూచించబడే మందు. కొన్ని సందర్భాల్లో ఈ మందుతో పాటు దానిమ్మపండు తినడం వల్ల రాబ్డొమియోలిసిస్​కు కారణం కావచ్చు. ఇదే జరిగితే కండరాల కణజాలం విచ్చిన్నమై మూత్రపిండాలు దెబ్బతిని ప్రమాదముంది.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ABOUT THE AUTHOR

...view details