Side Effects of Using Too Much Hand Sanitizer:శానిటైజర్ అతిగా వినియోగిస్తే.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. తాజాగా ఓ అధ్యయనం విషయాన్ని నిరూపించింది. హ్యాండ్ శానిటైజర్ అతిగా వాడటం వల్ల.. బ్రెయిన్ లోని కణాలు దెబ్బతింటాయని ఒహియో కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీలోని మాలిక్యులర్ బయాలజీ డిపార్ట్‌మెంట్ చేసిన పరిశోధనలో తేలింది.
ఈ సర్వేలో ఒహియో కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ మేరీ జోన్స్ పాల్గొన్నారు. హ్యూమన్ బ్రెయిన్లో ఒలిగోడెండ్రోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఈ కణాలు మెదడులోని నరాల చుట్టూ వ్యాపించి ఉండి.. మెదడు వేగంగా, చురుగ్గా పనిచేసేందుకు సహాయపడతాయి. మన బ్రెయిన్‌కు వేగంగా సంకేతాలు పంపించడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిని శానిటైజర్లలో ఉండే కొన్ని రసాయనాల దెబ్బతీస్తాయని అధ్యయనం చెబుతోంది.
సమ్మర్లో జింజర్, లెమన్ వాటర్ తాగుతున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా?
ప్రమాదం ఎలా? :మనం వాడే శానిటైజర్ కారణంగా అందులోని రసాయనాలు ముక్కు, చేతులు, చర్మం ద్వారా బాడీలోకి వెళతాయి. అలా వెళ్లిన శానిటైజర్‌లోని రసాయనాలు.. మెదడులోని నరాల చుట్టూ వ్యాపించి ఉన్న ఒలిగోడెండ్రోసైట్స్ కణాలను దెబ్బతీస్తాయని.. దీని వల్ల క్రమంగా మెదడు చురుగ్గా పనిచేయడం మానేస్తుందని అధ్యయనంలో వెల్లడైందట. ఒక్క హ్యాండ్ శానిటైజరే కాదు.. సబ్బులు, ఇంటినీ, టాయ్‌లెట్లను శుభ్రపరచటానికి ఉపయోగించే రసాయనాలను కూడా అతిగా వాడటం వల్ల సమస్యలు వచ్చి పడతాయని హెచ్చరిస్తున్నారు.
మెదడుకు మాత్రమే కాదు: శానిటైజర్ అవసరానికి మించి వాడటం వల్ల కేవలం మెదడుకి మాత్రమే కాదని ఆరోగ్యానికి కూడా చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శానిటైజర్ తరచుగా వాడినప్పుడు.. చర్మం కందిపోయి దద్దుర్లు వచ్చే అవకాశాలు ఎక్కువని తెలుపుతున్నారు. ఇందులోని ఆల్కహాల్‌తో పాటు ఉండే అనేక రసాయనాలు చర్మపు సహజ నూనెలను హరిస్తాయని.. దాంతో చర్మంలోని సహజమైన తేమ తగ్గిపోయి పగుళ్లు ఏర్పడతాయంటున్నారు. ఈ పగుళ్ల ద్వారా బ్యాక్టీరియా చాలా తేలిగ్గా చర్మంలోకి చేరుతుందని చెబుతున్నారు.