ETV Bharat / state

ఓఆర్‌ఆర్‌ చుట్టూ అందమైన పార్కులు - ఫ్యామిలీతో కలిసి సరదాగా వెళ్లొచ్చేయండి బాస్! - FOREST AROUND ORR

అటవీ శాఖ, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఓఆర్‌ఆర్‌ చుట్టూ పలు పార్కులు - కుటుంబాలతో కలిసి సందర్శించేలా అవకాశం

TREES AND PARKS IN OUTER RING ROAD
Forest around Outer Ring Road in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Forest around Outer Ring Road in Hyderabad : నగరంలో నిత్యం రణగొణ ధ్వని, కాలుష్యంతో సతమతమవుతున్న వేళ వీటికి దూరంగా ఉండి ప్రకృతి ఒడిలో కాసేపు సేదతీరేలా అవుటర్​ చుట్టూ అటవీ శాఖ, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో పలు పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని అందుబాటులోకి రాగా మరికొన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇలా ఓఆర్‌ఆర్‌ లోపల, బయట ఫారెస్టు బ్లాకులగా చేసి అభివృద్ధి చేస్తున్నారు. అందులోనే పలు సౌకర్యాలతో పార్కులగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రకృతిలో కాసేపు గడిపేలా ఏర్పాటు చేశారు.

అరుదైన జాతుల వృక్షాలతో అటవీ పార్కు

Forest around Outer Ring Road
నార్సింగి​ ఓఆర్‌ఆర్‌ జంక్షన్​ వద్ద ఎకో పార్కు (ETV Bharat)

నగరంలోని తుక్కుగూడ ఎగ్జిట్‌ నంబరు 14 వద్ద సుమారు 526 హెక్టార్ల విస్తీర్ణంలో శ్రీనగర్‌ అటవీ పార్కు ఉంది. పర్యాటకులకు కావాల్సిన వసతులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓఆర్​ఆర్​ నుంచి 12 కిలోమీటర్ల తర్వాత ఈ అటవీ పార్కు ఉంటుంది. దీనికి కోసం హెచ్‌ఎండీఏ దాదాపు రూ.8 కోట్లు వెచ్చించగా అక్కడ అరుదైన జాతుల వృక్షాలు చూడవచ్చు.

కుటుంబాలతో సరదాగా గడిపేలా

Forest around Outer Ring Road
కొత్వాల్‌గూడ ఎకో పార్కు (ETV Bharat)

అవుటర్‌ చెంతనే కొత్వాల్‌గూడ వద్ద ఎకో పార్కు పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. అక్కడ మొక్కల పెంపకం, పక్షుల పార్కు, పచ్చిక బయళ్లు వాక్‌వే సిద్ధమైంది. ఈ నెలాఖరులోపు ఇది అందుబాటులో రానుంది. అంతేకాకుండా రెండో దశలో వివిధ రకాల జాతులతో కూడిన చేపల అక్వేరియం, రాత్రి సమయంలో కుటుంబాలతో సరదాగా అడవిలోనే గడిపేందుకు ప్రత్యేక కాటేజీలు నిర్మించనున్నారు.

ఆహ్లాదాన్ని పంచే మన్యంకంచ

Forest around Outer Ring Road
మన్యంకంచ పార్కు (ETV Bharat)

కందుకూర్‌ మండలం లేమూర్‌లో 58.78 హెక్టార్లలో మన్యంకంచ పార్కు రూపుదిద్దుకుంది. ఈ పార్కులో మౌలిక వసతుల కోసం సుమారు రూ.4.49 కోట్లు ఖర్చు పెట్టారు. ఓఆర్​ఆర్​ తుక్కుగూడ ఎగ్జిట్​ 14 నంచి ఈ పార్కుకు చేరుకోవచ్చు.

నాగారం 'అర్బన్‌ ఫారెస్టు పార్క్​'

Forest around Outer Ring Road
నాగారం వద్ద అర్బన్‌ ఫారెస్టు పార్క్ (ETV Bharat)

మహేశ్వరం మండలంలోని 556.69 హెక్టార్లలో నాగారం వద్ద అర్బన్‌ ఫారెస్టు పార్క్​ను తీర్చిదిద్దారు. ఓఆర్​ఆర్​లో పెద్ద గోల్కొండ ఎగ్జిట్‌ నంబరు-15 వద్ద కిందకు వెళితే ఈ పార్కులోకి వెళ్లవచ్చు. వాచ్‌ టవర్, సఫారీ ట్రాక్, కుర్చీలు తదితర సౌకర్యాలున్నాయి. ఇక్కడ ఎటూచూసినా పెద్దపెద్ద చెట్లు, పక్షుల కిలకిలారావాలతో ఇది కనువిందు చేస్తోంది.

పచ్చదనంతో పార్కు అందాలు

Forest around Outer Ring Road
మహేశ్వరంలోని ఓ పార్కు (ETV Bharat)

మహేశ్వరంలోనే హర్షగూడ గ్రామానికి సమీపంలో సుమారు 87 ఎకరాల్లో ఈ పార్కును అభివృద్ధి చేశారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డులోని తుక్కుగూడ వద్ద ఎగ్జిట్‌ నంబరు-14 నుంచి ఈ పార్కుకు చేరుకోవచ్చు. ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా గడిపేలా దీన్ని తీర్చిదిద్దారు. అయితే పూర్తిగా పచ్చదనం ఉండడంతో ఈ పార్కు అందాలు ఆకట్టుకుంటున్నాయి.

లేక్‌వ్యూ పార్కు అందాలు

Forest around Outer Ring Road
లేక్‌వ్యూ పార్కు (ETV Bharat)

గత సంవత్సరం గండిపేట చెరువు పక్కనే రూ.38 కోట్లతో హెచ్‌ఎండీఏ లేక్‌వ్యూ పార్కును అందుబాటులోకి తెచ్చింది. అయితే దీనిని 18 హెక్టార్లలో తీర్చిదిద్దగా ఆర్ట్‌ పెవిలియన్లు, వాక్‌వే, పిక్నిక్‌ స్పేస్, ఫ్లవర్‌ టెర్రాస్, ఫుడ్‌కోర్టు, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్ తదితర సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం రోజుకు పదివేల మంది వరకు ఈ పార్కును సందర్శిస్తున్నారు.

చూడ్డానికి రెండు కళ్లు చాలని కొత్వాల్​గూడ ఎకో పార్క్​ - వారెవ్వా! ఏంటి బ్రో ఆ సదుపాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.