ETV Bharat / health

కండల కోసం జిమ్​లో ఇచ్చే ప్రోటీన్ పౌడర్లు వాడుతున్నారా? సిక్స్ ప్యాక్ ఏమో కానీ ఆస్పత్రి పాలవడం పక్కా! - PROTEIN POWDER SIDE EFFECTS

-మీరు కండల కోసం ప్రోటీన్ పౌడర్, స్టెరాయిడ్ల్ వాడుతున్నారా? -వీటి వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక!

Protein Powder Side Effects
Protein Powder Side Effects (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Dec 16, 2024, 12:10 PM IST

Protein Powder Side Effects: సిక్స్ ప్యాక్ బాడీ అంటే నేటి యువతకు చాలా ఇష్టం. చాలా మంది సిక్స్ ప్యాక్ కావాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కండలు తిరిగిన దేహం కోసం ఉదయం, సాయంత్రం జిమ్​లో తీవ్రంగా శ్రమిస్తుంటారు. కానీ, జిమ్​లో కసరత్తులు, వ్యాయామాలు చేసినా.. సిక్స్ ప్యాక్ రావడానికి చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే త్వరగా సిక్స్ ప్యాక్ రావాలని ఆశపడే కొంతమంది ఇతర దారుల్లో ప్రయత్నిస్తున్నారు. అందులో ముఖ్యంగా చాలా మంది స్టెరాయిడ్లు, ఇతర నిషేధిత ప్రొటీన్‌ పౌడర్లు వాడుతున్నారు. మరి వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందో మీకు తెలుసా?

ఇలా ఇష్టారాజ్యంగా స్టెరాయిడ్లు వాడితే కిడ్నీలపై భారం పడి ఆరోగ్యం గుల్లవుతుందని ప్రముఖ నెఫ్రాలజీ నిపుణులు డాక్టర్‌ శ్రీభూషణ్‌ రాజు హెచ్చరిస్తున్నారు. వీటిని కేవలం వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలని సూచిస్తున్నారు. లేకపోతే లైంగిక సామర్థ్యం కోల్పోవడం, మానసిక భ్రమలు, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా కిడ్నీ జబ్బుల బారిన పడే ప్రమాదమూ ఉంటుందని ఆయన వివరిస్తున్నారు.

"స్టెరాయిడ్లు, వేప్రొటీన్ల వంటి పదార్థాలతో రక్తం వడబోసే క్రమంలో కిడ్నీలపై అధిక ఒత్తిడి పడుతుంది. ఫలితంగా కొందరిలో కిడ్నీలకు హైపర్‌ఫిల్టరేషన్‌ గాయాలు అవుతుంటాయి. స్టెరాయిడ్స్‌తో కేవలం కిడ్నీల సమస్య మాత్రమే కాకుండా.. మధుమేహం, అధిక రక్తపోటు, ప్రొస్టేట్‌ క్యాన్సర్, వ్యాక్యులత లాంటి సమస్యల బారిన పడే ప్రమాదం ఉంటుంది."

--డాక్టర్‌ శ్రీభూషణ్‌ రాజు, విభాగాధిపతి, నెఫ్రాలజీ విభాగం, నిమ్స్‌

కృత్రిమ పెరుగుదల ఆరోగ్యానికి ప్రమాదమే
సహజంగా కాకుండా కృత్రిమ పద్ధతుల ద్వారా కండరాల పెరుగుదుల ప్రమాదమేనని నిపుణులు అంటున్నారు. స్టెరాయిడ్లు శరీరంలో మాంసకృత్తుల ఉత్పత్తికి దోహదం చేస్తూ.. కండర కణజాలం వేగంగా పెరిగేలా చేస్తాయని వివరిస్తున్నారు. ఈ ఇంజక్షన్లు తీసుకున్న 2-3 నెలల్లోపే కండలు పెరిగినట్లు కనిపిస్తాయని చెబుతున్నారు. కానీ, తర్వాత కసరత్తులు ఆపేసినా.. స్టెరాయిడ్లు మానేసినా అంతే వేగంగా కండరాలు కనుమరుగై శరీరం వదులుగా మారుతుందన్నారు. ట్రైనర్ల సమక్షంలో వ్యాయామాలు, సరిపడా ఆహారం తీసుకోవడం, చెడు అలవాట్లకు దూరంగా ఉంటే కొన్నాళ్లకు సిక్స్ ప్యాక్ బాడీ సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చలికాలంలో షుగర్ పేషెంట్లు జాగ్రత్త! ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవట!

మీ జుట్టు రాలిపోతుందా? జామాకుతో ఇలా చేస్తే ఒత్తుగా, సిల్కీ హెయిర్ వస్తుందట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.