ETV Bharat / offbeat

కర్ణాటక స్పెషల్ టేస్టీ​ "రవ్వ పొంగలి" - బ్రేక్​ఫాస్ట్​, డిన్నర్​కు పర్ఫెక్ట్​ - ఓసారి ట్రై చేయండి! - HOW TO MAKE RAVA PONGALI AT HOME

-గోధుమ రవ్వతో ఎన్నో రుచికరమైన వంటలు -ఇలా ఓసారి పొంగలి ట్రై చేస్తే అద్భుతమే

How to Make Rava Pongali at Home
How to Make Rava Pongali at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

How to Make Rava Pongali at Home : పొంగలి అనగానే చాలా మందికి స్వీట్​ రెసిపీ అయిన చక్కెర పొంగలి గుర్తుకువస్తుంది. కానీ మనం ఇంట్లో ఉప్మా కోసం ఉపయోగించే గోధుమ రవ్వతో కూడా అద్భుతమైన పొంగలి చేసుకోవచ్చు. కర్ణాటక స్పెషల్​ అయిన రవ్వ పొంగలి బ్రేకఫాస్ట్​కు సూపర్​ ఆప్షన్​. అంతేకాకుండా రాత్రి పూట లైట్​గా తినాలనుకునేవారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇక దీని టేస్ట్​ విషయానికి వస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది. దీనికి కాంబినేషన్​గా చట్నీ లేదా సాంబార్​ అద్దిరిపోతుంది. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • పెసరపప్పు - పావు కప్పు
  • గోధుమ రవ్వ - 1 కప్పు
  • నీళ్లు - సరిపడా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నెయ్యి - 6 టేబుల్​ స్పూన్లు
  • మిరియాలు - అర టీ స్పూన్​
  • జీలకర్ర - అర టేబుల్​ స్పూన్​
  • జీడిపప్పు - పావుకప్పు
  • అల్లం తురుము - అర టేబుల్​ స్పూన్​
  • పచ్చిమిర్చి చీలికలు - 4
  • పచ్చి కొబ్బరి ముక్కలు - పావు కప్పు
  • ఇంగువ - అర టీ స్పూన్​
  • కరివేపాకు - 2 రెబ్బలు
  • పసుపు - పావు టీ స్పూన్​

తయారీ విధానం:

  • ముందుగా స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి పెసరపప్పు వేసి సన్నని సెగ మీద మంచి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. పెసరపప్పు వేగి రంగు మారుతున్నప్పుడు దింపి కుక్కర్​లో వేసుకోవాలి.
  • ఇప్పుడు ఆ కుక్కర్​లో 1 కప్పు నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్​ మీద 5 విజిల్స్​ వచ్చేవరకు ఉడికించుకుని పక్కన పెట్టండి.
  • ఇప్పుడు అదే స్టవ్​ మీద పెసరపప్పును వేయించుకున్న పాన్​ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి గోధుమ రవ్వ వేసి సన్నని సెగ మీద మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీని కోసం ఓ 10 నిమిషాల సమయం పడుతుంది. ఆ తర్వాత తీసి మరో గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఈలోపు కుక్కర్​ మూత తీసి ఉడికించుకున్న పప్పును మెత్తగా మెదుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్​ ఆన్​ చేసి గిన్నె పెట్టి 5 కప్పుల నీరు తీసుకోండి. అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి మరిగించుకోవాలి.
  • నీరు బాగా మరుగుతున్నప్పుడు వేయించిన గోధుమ రవ్వను కొద్దికొద్దిగా పోసుకుంటూ కలుపుతుండాలి. ఆ తర్వాత మూత పెట్టి రవ్వను మెత్తగా ఉడికించాలి.
  • రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత.. ముందే మెత్తగా మెదుపుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసి మరో 5 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టండి.
  • ఇప్పుడు స్టవ్​ మీద బాండీ పెట్టి నెయ్యి పోసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత మిరియాలు వేసి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత జీలకర్ర, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం తరుగు, పచ్చిమిర్చి చీలికలు వేసి ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అనంతరం పచ్చి కొబ్బరి ముక్కలు, ఇంగువ, కరివేపాకు వేసి కొబ్బరి ముక్కలు రంగు మారేవరకు వేయించాలి. ఆ తర్వాత పసుపు వేసి మరో నిమిషం పాటు వేయించాలి.
  • ఈ వేగిన తాలింపును పొంగలిలో కలిపి వేడివేడిగా సర్వ్​ చేసుకుంటే అద్భుతమైన టేస్ట్​తో రవ్వ పొంగలి రెడీ. దీన్ని ప్లేట్​లోకి తీసుకుని పైన కొద్దిగా నెయ్యి వేసుకుని చట్నీ లేదా సాంబార్​తో తింటే మాటలుండవ్​.. అంత అద్భుతంగా ఉంటుంది. నచ్చితే మీరూ ట్రై చేయండి.

ఉప్మారవ్వతో నిమిషాల్లో చేసుకునే "రవ్వ పూరీలు" - ఒక్కసారి తిన్నారంటే టేస్ట్​కి ఎవరైనా ఫిదా!

నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ కేసరి - పక్కా కొలతలతో ఇలా ప్రిపేర్ చేసుకుంటే అద్దిరిపోతుంది!

గుడిలో ప్రసాదంగా పెట్టే చక్కెర పొంగలి - ఇలా ప్రాచీన పద్ధతిలో చేస్తే అద్భుతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.