Cyber Criminals Cheated Actress Mahima : ఓ సినీనటిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి డబ్బులు దోచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుందన్‌బాగ్‌లో నివసించే సినీనటి మహిమకు ఈ నెల 6న రంజన్‌షాహీ పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. సినీ నిర్మాతనంటూ పరిచయం చేసుకున్నాడు. కొంత సమయం తర్వాత అతడి సూచనల మేరకు అనిత అనే మరో మహిళ మహిమకు ఫోన్ చేసి తాను సింటా (సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) నుంచి హెచ్‌ఆర్ డైరెక్టర్‌ను మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నారు.
ఫారెక్స్ ట్రేడింగ్ పేరిట మోసం - వైద్యుడి నుంచి రూ.11.11 కోట్లు దోచేసిన సైబర్ దొంగలు
సింటాలో జీవితకాలం పనిచేసే కార్డును రూ.50,500కు అందిస్తున్నామని నమ్మబలికింది. అది నమ్మిన నటి మూడు దఫాలుగా డబ్బు బదిలీ చేశారు. అనంతరం తిరిగి డబ్బులు అడగడంతో మహిమకు అనుమానం వచ్చింది. సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేసి జరిగిందంతా చెప్పారు. రూ.20,200 సైబర్ నేరస్థుల ఖాతాలోకి వెళ్లకుండా పోలీసులు నిలిపివేశారు. మహిమ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆమె హీరో మంచు విష్ణు మోసగాళ్లు సినిమాలో సెకెండ్ హీరోయిన్‌గా కనిపించారు.
దేశంలో 'సెకను'కు 11 సైబర్ మోసాలు - గుర్తించడంలో మాత్రం 'తెలంగాణే' టాప్