ETV Bharat / technology

ఓలా జెన్-3 ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేశాయోచ్- తక్కువ ధరలోనే 320 కి.మీ రేంజ్​! - OLA LAUNCHES GEN 3 E SCOOTERS

ఓలా నుంచి నెక్స్ట్​ జరేషన్ స్కూటర్లు లాంఛ్- ప్రత్యర్థులకు ఇక చుక్కలే!

Ola launches Gen 3 e-scooters
Ola launches Gen 3 e-scooters (Photo Credit- Ola Electric)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 31, 2025, 2:21 PM IST

Updated : Jan 31, 2025, 2:28 PM IST

Ola Launches Gen 3 Electric Scooters: ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్​లో తనదైన ముద్ర వేసిన ఓలా ఎలక్ట్రిక్ శుక్రవారం తన కొత్త 'జెన్ 3 ఎలక్ట్రిక్' శ్రేణిని విడుదల చేసింది. ప్రీవియస్ జనరేషన్ మోడల్స్​తో పోలిస్తే మెరుగైన డిజైన్, ఫీచర్లతో వీటిని తీసుకొచ్చింది. అంతేకాక వీటి ధరలను కూడా ప్రీవియస్ వెర్షన్​ కంటే తక్కువతోనే పరిచయం చేసింది.

నాలుగు వేరియంట్స్​లో తీసుకొచ్చిన వీటిలో కంపెనీ అదిరే బ్యాటరీ ఆప్షన్​లను కూడా ప్రవేశపెట్టింది. 2kWh బ్యాటరీతో దీని ఎంట్రీ లెవెల్ 'S1 X' ధర మార్కెట్​లో రూ.79,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక 5.3kWh బ్యాటరీతో దీని అగ్రశ్రేణి 'S1 Pro+' ధర రూ.1,69,999 వరకు ఉంటుంది. ఈ లైనప్​లోని వేరియంట్​లు ఓలా లేటెస్ట్ EV ఆపరేటింగ్ సిస్టమ్​ MoveOS 5పై నడుస్తాయి.

Ola Electric Generation 3 scooters
Ola Electric Generation 3 scooters (Photo Credit- Ola Electric)

వేరియంట్స్:

  • S1 Pro
  • S1 Pro+
  • S1 X
  • S1 X+

వీటి రిలీజ్​పై మాట్లాడిన ఓలా ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్ కంపెనీ తన పోటీదారుల కంటే ముందుందని అన్నారు. "మా పోటీదారులు మా Gen1 స్థాయిలో కూడా లేరు. కానీ మేము మాత్రం ఇప్పుడు Gen3 స్థాయిలో ఉన్నాము" అని ఆయన పేర్కొన్నారు.

ఈ Gen 3 స్కూటర్లు మిడ్-డ్రైవ్ మోటార్, ఇంటిగ్రేటెడ్ మోటార్ కంట్రోల్ యూనిట్ (MCU)లను కలిగి ఉంటాయి. ఇవి ప్రీవియస్ మోడల్స్​లో ఉపయోగించిన హబ్ మోటార్లను రీప్లేస్ చేస్తూ వస్తాయి. పాత వాటి కంటే వీటిని ఐదు రెట్లు ఎక్కువ ఎఫిషియంట్, రిలియబుల్, లైట్​వెయిట్​తో డిజైన్ చేసినట్లు CEO భవిష్ అగర్వాల్ చెబుతున్నారు. అంతేకాక ఈ స్కూటర్లు ప్రీ-లూబ్రికేటెడ్ O-రింగ్‌లను కలిగి ఉన్న చైన్ డ్రైవ్‌తో కూడా వస్తాయి. ఇవి ప్రీవియస్ మోడళ్లలో ఉపయోగించిన బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ కంటే రెండు రెట్లు ఎక్కువ కాలం ఉంటాయని తెలుస్తోంది.

'బ్రేక్ బై వైర్' టెక్నాలజీ ఈ జెన్​ 3 లైనప్​కి అందించింది. ఈ సిస్టమ్ బ్రేక్ ప్యాడ్ వేర్, మోటార్ రెసిస్టెన్స్​ను బ్యాలెన్స్ చేసేందుకు బ్రేక్ లివర్‌పై సెన్సార్‌లను ఉపయోగిస్తుంది. తద్వారా దీని రేంజ్​ను 15% పెంచుతుంది. ఇది బ్రేక్ ప్యాడ్ లైఫ్​స్పాన్​ను రెట్టింపు చేస్తుంది. బ్రేకింగ్ సమయంలో ఈ మోటార్​ ఎలక్ట్రిసిటీని రీజనరేట్ చేసి ఎఫిషియన్సీని మరింత మెరుగుపరుస్తుంది. ఈ అద్భుతమైన టెక్నాలజీకి అగర్వాల్​ పేటెంట్ కలిగి ఉన్నట్లు సమాచారం.

ఇప్పుడు తీసుకొచ్చిన ప్రతి Gen 3 స్కూటర్ మెరుగైన భద్రత కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో వస్తుంది. అంతేకాక ఈ మోడళ్లలో తయారీ ఖర్చులలో 31% తగ్గింపు, ఎనర్జీ ఎఫిషియన్సీలో 10% పెరుగుదలతో పాటు ప్రీవియస్ జనరేషన్​లతో పోలిస్తే వీటి పీక్​ పవర్​ 53% ఎక్కువగా ఉంటుంది.

బ్యాటరీ ఆప్షన్స్: ఈ Gen 3 శ్రేణి వివిధ బ్యాటరీ ఆప్షన్​లను అందిస్తుంది.

Prices of Ola Electric Generation 3 Scooters
Prices of Ola Electric Generation 3 Scooters (Photo Credit- Ola Electric)

దీని 'S1 Pro' మోడల్ 3kWh, 4kWh బ్యాటరీలను కలిగి ఉంది. అదే సమయంలో 'S1 Pro+' వేరియంట్ 4kWh లేదా 5.3kWh బ్యాటరీ ప్యాక్‌లను అందిస్తుంది. ఇందులో ఓలా ఇన్-హౌస్ భారత్ సెల్ ఉంటుంది.

మరోవైపు ఎంట్రీ-లెవల్ 'S1 X' మోడల్ 2kWh, 3kWh, 4kWh బ్యాటరీ ఆప్షన్​లతో లభిస్తుంది. అయితే 'S1 X+' ప్రత్యేకంగా 4kWh బ్యాటరీతో వస్తుంది. ఇక ఫ్లాగ్‌షిప్ 'S1 Pro+' మోడల్ 320 కి.మీ.ల రేంజ్​, 141 కి.మీ/గం టాప్ స్పీడ్​తో వస్తుంది.

తక్కువ ధరలకే!: Gen 2 మోడళ్లతో పోలిస్తే 'Gen 3' స్కూటర్లకు ఓలా కంపెనీ తక్కువ ధరలకే తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్​లో 'Gen 3' మోడళ్లతో పాటు ప్రీవియస్ 'Gen 2' స్కూటర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

ఓలా Gen 3 ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు:

మోడల్ బ్యాటరీ కెపాసిటీధర
Ola S1X2 kWhరూ.79,999
Ola S1X3 kWhరూ.89,999
Ola S1X4 kWhరూ.99,999
Ola S1X+4 kWhరూ.1,07,999
Ola S1 Pro3 kWhరూ.1,14,999
Ola S1 Pro4 kWhరూ.1,34,999
Ola S1 Pro+4 kWhరూ.1,54,999
Ola S1 Pro+5.5 kWhరూ.1,69,999

ఈ కొత్త స్కూటర్ల ధరలు మరో ఏడు రోజుల వరకు మాత్రమే ఇలా ఉంటాయి. ఆ తర్వాత వీటి ధరలు పెరగొచ్చు.

Colour Options for Ola Electric Generation 3 Scooters
Colour Options for Ola Electric Generation 3 Scooters (Photo Credit- Ola Electric)

బుకింగ్ ఎప్పటి నుంచి?​: కంపెనీ తీసుకొచ్చిన కొత్త 'Gen 3' స్కూటర్ల ఆర్డర్​లు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే వీటి డెలివరీలు ఫిబ్రవరి మధ్యలో జరగనున్నాయి. భారత్ సెల్స్‌తో కూడిన 'Ola S1 Pro+' ఏప్రిల్‌లో డెలివరీకి అందుబాటులో ఉంటుంది. ఇదిలా ఉండగా ఓలా కంపెనీ ఫిబ్రవరి 5, 2025న తన కొత్త రోడ్‌స్టర్ X మోటార్‌బైక్‌ను లాంఛ్​ చేయనున్నట్లు ప్రకటించింది.

మరోవైపు ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే మన దేశంలో తన రిటైల్​ అండ్ సర్వీస్​ నెట్​వర్క్​ను గణనీయంగా విస్తరించింది. అంతకుముందు ఉన్న 800 స్టోర్‌ల సంఖ్యను నవంబర్ 2024లో ఏకంగా 4,000కి పెంచింది. వినియోగదారుల యాక్సెప్టెన్స్, EV తయారీ సంస్థలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారమే ఈ వృద్ధికి కారణమని అగర్వాల్ అన్నారు.

సూపర్ అప్​గ్రేడ్స్​తో నథింగ్ ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్!- ఫ్లిప్​కార్ట్​లో టీజర్ రిలీజ్

డీప్​సీక్​తో మీ డేటా సేఫేనా?- దీన్ని వాడేముందు ఈ విషయాలు తెలుసుకోండి!

స్టన్నింగ్ లుక్​లో హీరో స్పెషల్ బైక్- డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే!

Last Updated : Jan 31, 2025, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.