ETV Bharat / entertainment

2024లో ఈ హీరోలు అస్సలు కనిపించలే - 2025 మాత్రం డబుల్ ధమాకాతో! - TOLLYWOOD HEROES IN 2025

ఈ ఏడాది తెరపై కనిపించని హీరోలు వీళ్లే - వచ్చే సంవత్సరం మాత్రం డబుల్, త్రిపుల్ చిత్రాలతో!

Tollywood Heroes
Tollywood Heroes (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2024, 4:06 PM IST

Tollywood Heroes movies in 2025 : 2024 నెల చివరికి వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో 2025 వచ్చేస్తోంది. అయితే ఈ ఏడాది చాలా మంది హీరోల డైరీల్లో రిలీజ్ పేరే కనిపించలేదు. ప్రస్తుతం వీళ్లంతా 2025లోనే కనిపిస్తామంటూ చెబుతున్నారు. వాళ్లెవరంటే?

నాగచైతన్య , నితిన్, సాయితేజ్, అడివి శేష్‌ తదితరులు ముందు వరుసలో ఉంటారు. వీళ్ల సినీ ప్రయాణంలో విరామాలు చాలా తక్కువనే చెప్పాలి. కానీ, ఈసారి వీళ్లంతా ఒక్క విడుదల కూడా లేకుండానే 2024కు వీడ్కోలు పలకనున్నారు. అలాగని వీళ్లు ఏడాదంతా ఖాళీగానూ లేరు. ఒకటికి రెండు చిత్రాలతో సెట్స్‌పై తీరిక లేకుండానే గడిపారు. ఇవన్నీ వచ్చే ఏడాది వరుసగా తెరపైకి రానున్నాయి. కథానాయకుడు హీరో నాగ చైతన్య గతేడాది కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఆ వెంటనే చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్‌ సినిమాను సెట్స్​పైకి తీసుకెళ్లారు. వాస్తవానికి అది ఈ నెలలోనే విడుదల కావాలి. కానీ షూటింగ్ ఆలస్యమవడం వల్ల దాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 7కు పోస్ట్​పోన్​ చేశారు. దీంతో పాటే చైతన్య హీరోగా కార్తీక్‌ దండు డైరెక్షన్​లో ఓ చిత్రం రెడీ అయ్యింది. షూటింగ్​ దశలో ఉందీ చిత్రం. వచ్చే ఏడాది తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

హీరో నితిన్‌ గతేడాది ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు రాబిన్‌హుడ్‌గా ఫ్యాన్స్​ను పలకరించనున్నారు. ఇప్పుడీ సినిమా కొత్త ఏడాదికి వాయిదా పడినట్లు సమాచారం. ఇంకా నితిన్‌ శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తమ్ముడు అనే సినిమా చేస్తున్నారు. అలానే కొత్త ఏడాది ప్రారంభంలో వేణు యెల్దండి దర్శకత్వంలో ఎల్లమ్మ అనే సినిమాను ప్రారంభించనున్నారు.

అడివి శేష్‌ నుంచి చివరిగా వచ్చిన చిత్రాలు మేజర్‌, హిట్‌ 2. ఇప్పుడు గూఢచారికి సీక్వెల్‌గా జి2, డెకాయిట్‌ : ఎ లవ్‌స్టోరీని చేయనున్నారు.

కల్యాణ్‌రామ్‌ గతేడాది డెవిల్‌, అమిగోస్‌ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు. కానీ, ఈ రెండూ పర్వాలేదనిపించే రిజల్ట్​ను ఇచ్చాయి. ప్రస్తుతం ఆయన తన 21వ సినిమాతో సెట్స్‌పై బిజీగా ఉన్నారు. ప్రదీప్‌ చిలుకూరి తెరకెక్కిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రధమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అలానే కొత్త ఏడాదిలోనే బింబిసార 2 కూడా సెట్స్​పైకి తీసుకెళ్లనున్నారు కల్యాణ్ రామ్. అనిల్​ పాదూరి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

గతేడాది విరూపాక్ష, బ్రో సినిమాలతో బాక్సాఫీస్‌ ముందు విజయాన్ని అందుకున్న మెగా హీరో సాయి దుర్గా తేజ్‌ ఈ ఏడాది ఒక్క చిత్రాన్ని కూడా రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం అతడు కె.పి.రోహిత్‌ దర్శకత్వంలో ‘సంబరాల ఏటిగట్టు’ అనే పాన్‌ ఇండియా చిత్రం చేస్తున్నారు. వచ్చే ఏడాది దసరా కానుకగా సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాగశౌర్య నుంచి కూడా కొత్త చిత్రమేదీ బయటకు రాలేదు. ఆయన రీసెంట్​గానే రామ్‌ దేశిన దర్శకత్వంలో కొత్త సినిమాను పట్టాలెక్కించారు. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది తెరపైకి రానుంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కూడా తెలుగు తెరపై కనిపించి మూడేళ్లు అవుతుంది. గతేడాది ఛత్రపతి హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకున్నప్పటికీ చేదు ఫలితమే వచ్చింది. దీంతో సాయి శ్రీనివాస్‌ ఇప్పుడు తెలుగులో టైసన్‌ నాయుడు, భైరవం చిత్రాలతో పని చేస్తున్నారు. అలాగే వీటితో పాటు మరో మూడు ప్రాజెక్ట్‌లను కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇవ్వన్నీ కొత్త ఏడాదిలోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రాలతో హ్యాట్రిక్‌ విజయాలను అందుకున్న హీరో నవీన్‌ పొలిశెట్టి నుంచి ఒక్క చిత్రం కూడా తెరపైకి రాలేదు. వచ్చే ఏడాది అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

అఖిల్‌ అక్కినేని గతేడాది ఏజెంట్‌ పెద్ద డిజాస్టర్​ను అందుకున్నారు. ఇప్పుడు ఆయన వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్‌ మురళీ కిశోర్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.

ఉప్పెన, కొండపొలం సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన హీరో వైష్ణవ్‌ తేజ్‌, ఆ తర్వాత కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్నారు. త్వరలో ఆయన కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని సమాచారం. కొత్త ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

పెళ్లికి ముందు ఫస్ట్​ టైమ్ అక్కడ కలిశాం - నా చేతికి చైతూ గోరింటాకు కూడా పెట్టారు : శోభిత

'RRR'ను దాటేసిన 'పుష్ప'- బాక్సాఫీస్​ను రూల్ చేస్తున్న బన్నీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.