ETV Bharat / state

పిల్లలకు స్కూల్స్​​ హాలిడే ఇచ్చి - 80 మంది ఉపాధ్యాయులు ఏం చేశారో తెలుసా? - TEACHERS PARTY IN SCHOOL

విద్యార్థులను ఇంటికి పంపించి ఉపాధ్యాయుల పార్టీ - కలెక్టర్​ ఆగ్రహం - డీఐఓఎస్​ సస్పెండ్​, ఉపాధ్యాయులకు నోటీసులు - హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో జరిగిన ఘటన

Teachers for Took Holiday to Children
Teachers for Took Holiday to Children (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Teachers for Took Holiday to Children : పిల్లలకు విద్యాబుద్ధులు, పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే.. పిల్లలను ఇంటికి వెళ్లిపోమని చెప్పి దావత్​లు చేసుకోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. హైదరాబాద్​ జిల్లాలోని షేక్​పేట్​ మండల పరిధిలోని ఈ ఘటన జరిగింది. దీనిపై కలెక్టర్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టి బాధ్యులైన డీఐఓఎస్​ యాదగిరిని సస్పెండ్​ చేయడంతో పాటు ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్​ జిల్లాలోని షేక్​ పేట్​ మండల పరిధిలోని 20 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ ఈ నెల 13న ఆ పాఠశాలల్లో విధులు నిర్తిస్తున్న 80 మంది సెకెండ్​ గ్రేడ్​ టీచర్లు, ప్రధానోపాధ్యాయులతో పాటు డిప్యూటీ ఇన్​స్పెక్టర్​ ఆఫ్​ స్కూల్స్​(డీఐఓఎస్​) యాదగిరి కలిసి దావత్​ చేసుకోవాలని అనుకున్నారు. అందుకు అనువైన ప్రదేశంగా బంజారాహిల్స్​లోని ప్రభుత్వ పాఠశాలను ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఆ 20 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు.

అనంతరం ఉపాధ్యాయులు బడులకు తాళాలు వేసి బంజారాహిల్స్​లోని పాఠశాలకు చేరుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన దావత్​లో పాల్గొని విందు భోజనం చేశారు. మధ్యాహ్నమే పిల్లలంతా ఇళ్లకు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఏం జరిగిందని పిల్లలను పేరెంట్స్ ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. దీంతో ఈ విషయంపై కలెక్టర్​ దృష్టికి కొంత మంది తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఈ విషయంపై హైదరాబాద్​ కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి తీవ్రంగా పరిగణించారు. ఇక డీఐఓఎస్​ను సస్పెండ్​ చేయడంతో పాటు మిగిలిన ఉపాధ్యాయులకు తాఖీదులు జారీ చేశారు. ఇప్పుడు ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Mana ooru Mana Badi program : భలే మంచి మాస్టార్.. 'బడిబాట'ను ఎంత బాగా ప్రచారం చేస్తున్నారో..!

స్కూల్​​ యూనిఫామ్​లో టీచర్​.. పిల్లల్లో కలిసిపోయి, ఆటపాటలతో పాఠాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.