ETV Bharat / health

అన్నం లేదా చపాతీ - షుగర్​ తగ్గేందుకు ఏది తింటే మంచిది? - నిపుణుల సమాధానమిదే! - IS RICE OR ROTI GOOD FOR DIABETES

-ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న డయాబెటిస్​ బాధితుల సంఖ్య -ఈ జాగ్రత్తలు పాటిస్తే షుగర్​కు కళ్లెం వేయొచ్చంటున్న నిపుణులు

Rice Vs Chapati Which is Better for Diabetes
Rice Vs Chapati Which is Better for Diabetes (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Rice Vs Chapati Which is Better for Diabetes : వయసుతో సంబంధం లేకుండా నేటి జనరేషన్​లో అందరినీ వేధిస్తోన్న సమస్య డయాబెటిస్​. ఇక ఒక్కసారి షుగర్​ ఎటాక్​ అయితే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. తినే తిండిని పూర్తిగా తగ్గించుకోవాలి. ఒకవేళ ఏదైనా తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తినాల్సిన పరిస్థితి. ఎందుకంటే.. ఏది తింటే షుగర్​ ఎక్కువ, తక్కువ అవుతుందో తెలియదు. కాబట్టి షుగర్​ పేషెంట్లు తినే ఆహారం విషయంలో కచ్చితంగా ఉంటారు. ఇదిలా ఉంటే మధుమేహంతో బాధపడుతున్న చాలా మంది ఓ పూట అన్నం తింటే మిగిలిన రెండు పూటలు చపాతీలు తింటుంటారు. ఇలా చపాతీలు తింటే డయాబెటిస్ అదుపులో ఉంటుందని భావిస్తుంటారు. మరి, నిజంగానే షుగర్ సమస్య ఉన్న వారు అన్నానికి బదులుగా చపాతీలు తింటే మేలు చేస్తుందా? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఇలా చేస్తే మంచిదట : క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, శరీర అవసరాలకు తగిన పోషకాహారం, శారీరక శ్రమ వంటివాటితో చక్కెర వ్యాధి బారినపడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్​ జానకీ శ్రీనాథ్​ చెబుతున్నారు. షుగర్‌ పేషెంట్స్‌ తప్పనిసరిగా తమకంటూ ఓ ప్రత్యేకమైన ఆహారపట్టికను ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపు చేసుకోవాలంటే ముందు ఎత్తుకు తగ్గ బరువున్నారో లేదో చూసుకోమంటున్నారు. ఒకవేళ బరువు తక్కువ ఉంటే... సాధారణ స్థాయికి పెరగమని.. ఎక్కువ ఉంటే వెయిట్​ తగ్గడానికి ప్రయత్నించమంటున్నారు. అలానే మీరు రోజంతా ఎలాంటి శారరీక శ్రమ చేస్తారు? అందుకు ఎంత మేర శక్తి అవసరం అవుతుందన్న విషయాలను కెలొరీల్లో నిర్ధరించుకుని ఆహారరూపంలో తీసుకోవాలంటున్నారు. డయాబెటిస్​ పేషెంట్లు ఉపయోగించే ట్యాబెట్లు, ఇన్సులిన్‌ డోసు అందరికీ ఒకలా ఉండదని చెబుతున్నారు.

ఏది తింటే మంచిది: ఇక రక్తంలో గ్లూకోజ్​ స్థాయుల నియంత్రణకు అన్నం, చపాతీల్లో ఏది తిన్నా పెద్దగా తేడా ఏమీ ఉండదని సూచిస్తున్నారు డాక్టర్​ జానకీ శ్రీనాథ్​. శరీరానికి సరిపడా శక్తికి తగినట్లు ఆ పూటకి సరిపడా కేలరీలు తీసుకుంటున్నామో లేదో చూసుకుంటే చాలంటున్నారు. మొదటి నుంచీ మీ ఆహారపుటలవాట్లకు భిన్నంగా ఏదీ బలవంతంగా తినక్కర్లేదని సూచిస్తున్నారు.

అన్నం కూడా ఎంత మోతాదు తింటున్నామో గమనించుకోవాలని చెబుతున్నారు. చపాతీలను లెక్కకు మించి తిన్నా, బాగా రావాలని ఎక్కువ ప్రాసెసింగ్‌ చేసిన గోధుమపిండి వాడినా కూడా ఫలితం ఉండదంటున్నారు. లో గ్లైసమిక్‌ కలిగిన బియ్యాం రకాలు ఎన్నో ఉన్నాయని.. వాటిని ఎంచుకోవచ్చంటున్నారు. అన్నం, చపాతీలు ఏం తిన్నా.. వీటితోపాటు ఆకుకూరలు, వెజిటబుల్‌ సలాడ్, పీచు అధికంగా ఉండే పదార్థాలు, సరిపడా ప్రొటీన్‌ వంటివి తీసుకుంటే.. గ్లూకోజ్‌ నెమ్మదిగా విడుదలై ఆకలి తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే పోషకాహారం తీసుకుంటూ శారీరక శ్రమా తప్పక చేయాలని.. కండశాతం పెరిగితే బ్లడ్‌ షుగర్‌ హెచ్చుతగ్గుల్ని తట్టుకునే శక్తి వస్తుందని సూచిస్తున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్​ డాక్టర్​ జానకీ శ్రీనాథ్​.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీరు షుగర్ పేషెంట్సా? - రాత్రిపూట ఇలా చేస్తే చక్కెర స్థాయులు పెరుగుతాయట! - ఇవి తప్పక తెలుసుకోండి!!

సంచలనం : షుగర్ బాధితులకు గుడ్ న్యూస్ - ఇకపై ఇన్సులిన్ అవసరమే లేదట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.