ETV Bharat / state

కార్మికులకు వైకల్యం సంభవిస్తే ప్రభుత్వ సాయం - రూ.5 లక్షలు అందించే స్కీమ్​ తెలుసా? - APPLY FOR DISABILITY RELIEF SCHEME

-కార్మిక కుటుంబాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం -ప్రమాదవశాత్తు వైకల్యం ఏర్పడితే ఆర్థిక సాయం

Disability Relief Scheme for Workers in TG
Disability Relief Scheme for Workers in TG (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Disability Relief Scheme for Workers in TG : కూలి పనులు చేస్తూ జీవితం సాగించే కుటుంబాల్లో.. ఇంటిపెద్ద ఏదైనా ప్రమాదానికి గురై వైకల్యం సంభవిస్తే ఆ కుటుంబ పరిస్థితి హృదయ విదారకంగా ఉంటుంది. ఇలాంటి దీన స్థితిలో ఉండేవారికి అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం.. "డిసేబిలిటీ రిలీఫ్ స్కీమ్​ను తీసుకొచ్చింది. తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి, కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

ఈ స్కీమ్​ ద్వారా పని ప్రదేశంలో ఏదైనా ప్రమాదం జరిగి కార్మికుడికి శాశ్వత వైకల్యం సంభవిస్తే.. రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం, అదే.. పాక్షిక వైకల్యానికి రూ.4 లక్షల వరకు రిలీఫ్ ఫండ్ అందిస్తోంది. మరి.. ఇందుకు కావాల్సిన అర్హతలు ఏంటి? ఏ ఏ పత్రాలు అవసరం? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అర్హతలు :

  • ఆర్థిక సాయం పొందాలనుకుంటున్న బాధిత కార్మికుడు తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డులో సభ్యుడై ఉండాలి. అంటే.. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు జారీ చేసే గుర్తింపు కార్డు(Labour Card) కలిగి ఉండాలన్నమాట.
  • పనిచేస్తున్న ప్రదేశంలో ప్రమాదం కారణంగా వైకల్యం సంభవించి ఉండాలి.

దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు :

  • కార్మికుడి ఆధార్ కార్డ్
  • బాధిత కార్మికుడి రిజిస్ట్రేషన్ కార్డ్(ఒరిజినల్)
  • దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
  • రెన్యూవల్ చలాన్ కాపీ
  • డిసేబిలిటీ సర్టిఫికెట్(అధికారులు జారీ చేసినది)
  • FIR కాపీ (పోలీస్ కేసు నమోదైతే)
  • అడ్వాన్స్ స్టాంపెడ్ రశీదు
  • బ్యాంక్ పాస్‌బుక్ కాపీ

దరఖాస్తు విధానం : పని ప్రదేశంలో జరిగిన ప్రమాదంలో శాశ్వత లేదా పాక్షిక వైకల్యం పొందిన కార్మికుడు ఈ స్కీమ్ కింద లబ్ధి పొందాలంటే ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

  • అందుకు.. దరఖాస్తుదారుడు ముందుగా డిసేబిలిటీ స్కీమ్​కి సంబంధించిన అప్లికేషన్ ఫారమ్​ని పొందాలి. దాని కోసం సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలి. లేదంటే.. కార్మిక శాఖ అధికారిక వెబ్​సైట్ విజిట్​ చేసి కూడా ఫారమ్​ని డౌన్​లోడ్ చేసుకోవచ్చు.
  • ఆ తర్వాత ఆ ఫారమ్​లో వివరాలన్నీ కరెక్ట్​గా నమోదు చేయాలి. తర్వాత అవసరమైన పత్రాలను అప్లికేషన్ ఫారమ్​కి జత చేయాలి.
  • అనంతరం ఫారమ్​పై సంతకం చేసి కార్మిక శాఖలోని సంబంధిత అధికారికి అందజేయాలి.
  • అప్లికేషన్ ఇచ్చాక దరఖాస్తు చేసినట్టుగా మీరు అధికారి వద్ద నుంచి రశీదు తీసుకోవాలి.
  • అలాగే రశీదుపై అప్లికేషన్​ సబ్మిట్​ చేసిన తేదీ, సమయంతో పాటు మరికొన్ని ముఖ్యమైన వివరాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా.. అని ఓసారి పరిశీలించుకోవాలి.
  • మీ దరఖాస్తు చేసిన తర్వాత.. అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి తగ్గ ప్రభుత్వ అధికారి దానిపై విచారణ జరుపుతారు.
  • అప్పుడు ప్రమాదవశాత్తుగానే శాశ్వత లేదా పాక్షిక వైకల్యం సంభవించినట్లు నిర్ధరణ జరిగితే.. నేరుగా బాధిత కార్మికుడి బ్యాంక్ అకౌంట్​లో ఆర్థిక సాయం జమ అవుతుంది.

మీకు ఈ కార్డు ఉందా? - లేకపోతే చాలా పథకాలు మిస్ అయినట్లే- ఎలా అప్లై చేయాలో తెలుసా?

స్థిరమైన ఆదాయం కావాలా? రిస్క్ ఏమాత్రం వద్దా? అయితే ఈ ప్రభుత్వ పథకాలపై ఓ లుక్కేయండి!

ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.6 లక్షల సాయం - ఈ స్కీమ్ గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.