ETV Bharat / business

తక్కువ వడ్డీకే హోమ్​ లోన్ + రూ.1.5లక్షల సబ్సిడీ - ప్రభుత్వ పథకానికి అప్లై చేసుకోండిలా! - HOW TO APPLY FOR PMAY

పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజల కోసం పీఎం ఆవాస్ యోజన 2.0 ప్రారంభం - ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిలా!

PMAY 2.0
PMAY 2.0 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2024, 3:43 PM IST

How To Apply For PMAY 2.0 : మీరు కొత్త ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్‌. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 2.0 (PMAY 2.0) ప్రారంభమైంది. దీనికి అప్లై చేసుకుంటే చాలు మీ కలల ఇంటిని సొంతం చేసుకోవచ్చు. ఎలా అంటే?

కోటి ఇళ్లు
పట్టణ ప్రాంతాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్), మధ్యతరగతి కుటుంబాలకు సరసమైన ధరల్లో గృహ నిర్మాణం/ కొనుగోలు/ అద్దెకు ఇల్లు తీసుకోవడం లాంటి వాటికి - ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ తీసుకొచ్చింది. 2024 ఆగస్టు 9న కేంద్ర కేబినెట్ ఈ పథకాన్ని ఆమోదించింది. దీని ద్వారా ఒక కోటి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది.

గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, పీఎంఏవై మొదటి దశలో 1.18 కోట్ల గృహాలు మంజూరు చేశారు. వాటిలో ఇప్పటికే 85.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చారు. ఇప్పుడు PMAY-U 2.0కు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడితో, ఒక కోటి ఇళ్లను పేద, మధ్యతరగతి వాళ్లకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కనుక అర్హులైన వాళ్లు ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు.

వడ్డీ రాయితీ : పీఎంఏవఐ-యూ 2.0 స్కీమ్‌లో భాగంగా, గృహ రుణాలపై వడ్డీ రాయితీ అందిస్తారు. ఉదాహరణకు రూ.35 లక్షల విలువైన ఇంటి కోసం రూ.25 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఈ రుణాన్ని తీసుకునే లబ్ధిదారులు 12 సంవత్సరాల కాలవ్యవధి వరకు, మొదటి రూ.8 లక్షల రుణంపై 4 శాతం వరకు వడ్డీ రాయితీ పొందవచ్చు. అర్హత కలిగిన లబ్ధిదారులు 5 సంవత్సరాల్లో రుణం తీర్చాలని అనుకుంటే, గరిష్ఠంగా రూ.1.80 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది.

కావాల్సిన పత్రాలు!

  • దరఖాస్తుదారు + అతని/ఆమె కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్‌ వివరాలు
  • ఆధార్‌ కార్డ్‌తో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌)
  • కుల ధ్రువీకరణ పత్రం (కాస్ట్ సర్టిఫికెట్‌)
  • భూమి యాజమాన్య పత్రాలు (సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటే)

దరఖాస్తు విధానం
How To Apply For PMAY 2.0 Scheme :

  • ముందుగా మీరు https://pmay-urban.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజ్‌లోని Apply for PMAY-U 2.0 లింక్‌పై క్లిక్ చేయాలి.
  • స్కీమ్‌ వివరాలు, నిబంధనలు అన్నీ పూర్తిగా చదవాలి.
  • మీకు అర్హత ఉందా, లేదా అని (ఎలిజిబిలిటీ) తెలుసుకునేందుకు, మీ వార్షిక ఆదాయ (యాన్యువల్‌ ఇన్‌కమ్‌) వివరాలను నమోదు చేయండి.
  • అథంటికేషన్ కోసం మీ ఆధార్ వివరాలు నమోదు చేయాలి.
  • అప్లికేషన్ ఫారమ్‌లో మీ ఆదాయం వివరాలు, చిరునామా సహా అన్ని వివరాలు నమోదు చేసి, సబ్మిట్ చేయాలి. అంతే సింపుల్‌!
  • ఒకసారి సబ్మిట్ చేసిన తరువాత దాని స్టేటస్‌ను కూడా ఈ వెబ్‌సైట్‌లోనే చూసుకోవచ్చు.

హోమ్ లోన్ కోసం మంచి బ్యాంక్‌ను ఎంచుకోవాలా? ఈ టాప్‌-6 టిప్స్ మీ కోసమే!

హోం లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.