Ashwin Retirement : టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్ అశ్విన్ రిటైర్మెంట్పై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పందించాడు. అశ్విన్ నిర్ణయం తనను భావోద్వేగానికి గురిచేసిందని పేర్కొన్నాడు. తనతో ఉన్న అనుబంధాన్ని విరాట్ ఆ సందర్భంహా గుర్తుచేసుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక అంతకుముందు మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో అశ్విన్‌ను విరాట్ భావోద్వేగంతో హాగ్ చేసుకున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
'14ఏళ్లుగా నీతో కలిసి క్రికెట్ ఆడుతున్నా. నువ్వు ఈరోజు రిటైర్మెంట్ గురించి నాతో చెప్పగానే కాస్త ఎమోషనల్ అయ్యాను. నీతో కలిసి ఆడిన రోజులన్నీ ఒక్కసారిగా నా కళ్లముందు తిరిగాయి. నీతో ఆడిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశాను. నీ నైపుణ్యాలు అద్భుతం. భారత క్రికెట్‌కు నువ్వు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నువ్వు భారత్ క్రికెట్లో ఓ లెజెండరీ ప్లేయర్. ఇకపై నీ జీవితం కుటుంబంతో కలిసి ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నా. థాంక్స్ మై డియర్ బడ్డీ' అని విరాట్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
I’ve played with you for 14 years and when you told me today you’re retiring, it made me a bit emotional and the flashbacks of all those years playing together came to me. I’ve enjoyed every bit of the journey with you ash, your skill and match winning contributions to Indian… pic.twitter.com/QGQ2Z7pAgc
— Virat Kohli (@imVkohli) December 18, 2024
🫂💙🇮🇳
— Star Sports (@StarSportsIndia) December 18, 2024
Emotional moments from the Indian dressing room 🥹#AUSvINDOnStar #BorderGavaskarTrophy #Ashwin #ViratKohli pic.twitter.com/92a4NqNsyP
'క్రికెట్ కెరీర్‌ను అద్భుతంగా ముగించిన అశ్విన్‌కు అభినందనలు. టెస్ట్ క్రికెటర్‌గా నీ ఆశయాలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. దశాబ్దానికి పైగా భారత స్పిన్‌కు మార్గదర్శిగా నిలిచావు. నువ్వు సాధించిన విజయాలపై చాలా గర్వంగా ఉంది. ఇకనుంచి మనం తరచుగా కలుస్తామని ఆశిస్తున్నా' అని మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ అన్నాడు.
'అశ్విన్ బ్రో నీకు సలాం! బంతితో నువ్వు చేసే మ్యాజిక్, టెస్ట్ క్రికెట్‌పై నీకు ఉన్న అభిరుచి మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. మాకు లెక్కలేనన్ని ఆనంద క్షణాలను, గర్వపడే విజయాలను అందించినందుకు కృతజ్ఞతలు. నీ జీవితంలో తదుపరి అధ్యాయం మరింత అందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా' అని తనకు అశ్విన్‌తో ఉన్న రిలేషన్‌ను సురేశ్ రైనా గుర్తుచేసుకున్నాడు.
కాగా, 2009లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన అశ్విన్ టీమ్ఇండియాకు 15 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా టెస్టుల్లో అశ్విన్ భారత్‌కు కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాల్లో భాగం అయ్యాడు. తన కెరీర్లో 106 టెస్టుల్లో అశ్విన్ 537 వికెట్లు, 3503 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. ఇక 116 వన్డేల్లో 156, 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు.
Take a bow, Ashwin bro! 🏏 Your magic with the ball, sharp cricketing mind, and unmatched passion for Test cricket will forever be etched in our hearts. Thank you for giving us countless moments of joy and pride. Wishing you all the best for your next chapter! 🙌❤️ #Ashwin… pic.twitter.com/5jBuHusPn2
— Suresh Raina🇮🇳 (@ImRaina) December 18, 2024
అశ్విన్ షాకింగ్ డెసిషన్ - క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆల్‌రౌండర్