ETV Bharat / state

'ఫ్యూచర్‌ సిటీ'కి రాచబాట - కొంగరకలాన్‌ టు రీజనల్‌ రింగ్‌రోడ్డు వయా 'భావి నగరం' - FUTURE CITY ROAD PROJECT

ఫ్యూచర్‌ సిటీకి రవాణా సౌకర్యం కోసం కార్యాచరణ రూపొందించిన అధికారులు - ఔటర్‌ తరహాలో 40 కిలోమీటర్ల మేర నిర్మాణం - 458 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్‌ - కొనసాగుతున్న సర్వే

Kongarakalan to Future City outer Road Project
Etv BharatKongarakalan to Future City outer Road Project (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Kongarakalan to Future City outer Road Project : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌ సిటీ( భావి నగరాని)కి రవాణా సౌకర్యాల కోసం అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు హైదరాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి ఫ్యూచర్‌ సిటీకి చేరుకునేలా ఔటర్‌ తరహాలో 330 అడుగుల రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో కొంగరకలాన్‌ నుంచి ఫ్యూచర్‌ సిటీ మీదుగా రిజినల్​ రింగ్​రోడ్డు వరకు 40 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించడంతోపాటు వెయ్యి ఎకరాల ప్రైవేటు భూములను అధికారులు సేకరించనున్నారు. ఈ సందర్భగా తొలి దశలో 458 ఎకరాలు సేకరణకు నోటిఫికేషన్​ జారీ చేశారు.

లగచర్ల ఘటన నేపథ్యంలో..

వికారాబాద్‌ జిల్లాలోని లగచర్లలో భూసేకరణపై జరిగిన రైతుల వ్యతిరేకత, దాడి ఘటనలను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ అధికారులు ప్రైవేటు వ్యక్తులు, రైతుల నుంచి భూములు సేకరిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెవెన్యూ రికవరీ యాక్ట్, 2013 ప్రకారం అధికారులు రైతులకు పరిహారం ఇస్తున్నారు. ఇటీవలే రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేయగా కొద్దిరోజులుగా కందుకూరు మండలంలోని గ్రామాల్లో సర్వే చేస్తున్నారు.

Kongarakalan to Future City outer Road Project
ఫ్యూచర్‌ సిటీ ఔటర్‌ రోడ్డు నమూనా (ETV Bharat)

కొందరు రైతులను అధికారులు తమతోపాటు తీసుకెళ్తున్నారు. పోలీసులకు సమాచారమిచ్చి సర్వే పూర్తి అయ్యే వరకు ఉండాలి కోరుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీ గురించి ప్రకటించిన తర్వాత మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, తుక్కుగూడ ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి. దీంతో కొందరు రైతులు మార్కెట్‌ ధరలకే తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు.

మెరుగైన రవాణా కోసం..

కొంగరకలాన్‌ నుంచి ఫ్యూచర్‌ సిటీ మీదుగా ప్రాంతీయ రింగ్‌రోడ్డుకు నిర్మిస్తున్న రహదారి శంషాబాద్‌ విమానాశ్రయంతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి సులభంగా చేరుకునేలా ఉంటుందని వివరిస్తున్నారు. హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ, రహదారులు, భవనాలశాఖ అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు.

ఫ్యూచర్‌ సిటీ రహదారి కోసం కందుకూరు మండలంలో సర్వే నిర్వహిస్తున్న అధికారులు (ETV Bharat)

రోడ్డు మార్గం ఇలా..

శంషాబాద్‌ - పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ ఎగ్జిట్‌ నంబర్‌ 13 వద్ద కొంగరకలాన్‌ నుంచి మీర్‌ఖాన్‌పేట్‌లోని ఫ్యూచర్‌సిటీకి, అక్కడి నుంచి ఆమన్‌గల్‌ మండలం ఆకుతోటపల్లి వద్ద రీజనల్‌రింగ్‌ రోడ్డుకు అనుసంధానం చేస్తూ రోడ్డు అందుబాటులోకి రానుంది. దీనితోపాటు సర్వీస్‌రోడ్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఫ్యూచర్‌ సిటీలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సన్నాహాలు - 8 వేల ఎకరాల భూసేకరణ - Land Acquisition for Future City

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.