ETV Bharat / sports

రవిచంద్రన్ అశ్విన్ టాప్ 10 రికార్డ్స్​ ఇవే - RAVICHANDRAN ASHWIN TOP RECORDS

రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ సాధించిన టాప్ 10 రికార్డులు మీకు తెలుసా?

Ravichandran Ashwin Top Records
Ravichandran Ashwin Top Records (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 18, 2024, 5:40 PM IST

Ravichandran Ashwin Top Records : టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్ బై చెప్పాడు. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు అశ్విన్ ప్రకటించాడు. తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్​లో అశ్విన్ ఎన్నో మైలురాళ్ల‌ను అందుకున్నాడు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

భారత తరఫున ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్

టీమ్ ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్​గా అశ్విన్ ఉన్నాడు. భారత్ తరఫున అశ్విన్ 287 మ్యాచ్​లు ఆడి 765 వికెట్లు తీశాడు. అనిల్ కుంబ్లే 401 మ్యాచుల్లో 953 వికెట్లు తీసి అశ్విన్ కన్నా ముందున్నాడు.

టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్

టెస్ట్ క్రికెట్​లో గొప్ప ఆఫ్ స్పిన్నర్లలో అశ్విన్ ఒకరు. అందుకే భారత్ తరఫున అనిల్ కుంబ్లే తర్వాత టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్​గా అశ్విన్ నిలిచారు. యాష్ 106 టెస్టుల్లో 24 బౌలింగ్ సగటుతో 537 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా అనిల్‌ కుంబ్లే (619) అగ్రస్థానంలో ఉన్నాడు.

5 వికెట్ హాల్​లో రెండో ప్లేస్

టెస్టుల్లో 37సార్లు ఒక ఇన్నింగ్స్​లో ఐదు వికెట్ల హాల్​ను తీశాడు అశ్విన్. శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ 67సార్లు ఈ ఘనత సాధించి ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు.

వేగంగా 500 వికెట్లు తీసిన రెండో బౌలర్

టెస్టుల్లో అత్యంత వేగంగా 500 వికెట్లు సాధించిన రెండో బౌల‌ర్​గా అశ్విన్ నిలిచాడు. 98 మ్యాచుల్లోనే అత‌డు ఈ మైలురాయిని చేరుకున్నాడు. 250, 300, 350 టెస్టు వికెట్లు వేగంగా సాధించిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

226 మంది అవుట్

టెస్టు క్రికెట్​లో బౌల్ట్‌, ఎల్బీడ‌బ్ల్యూల రూపంలో 226 మందిని అశ్విన్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో టెస్టుల్లో బౌల్ట్‌, ఎల్బీడ‌బ్ల్యూ రూపంలో అత్యధిక మందిని అవుట్ చేసిన బౌలర్​గా అశ్విన్ రికార్డుకెక్కాడు.

అరుదైన రికార్డు

టెస్టు క్రికెట్​లో నాలుగు సార్లు అశ్విన్ ఒక టెస్టు మ్యాచులో ఐదు వికెట్లు తీయ‌డంతో పాటు సెంచ‌రీ బాదాడు. ఇంగ్లాండ్ ఆట‌గాడు ఇయాన్ బోథ‌మ్ (5) మాత్ర‌మే అత‌డి క‌న్నా ముందున్నాడు.

పెద్ద వయసులో 5ఫర్

టెస్టుల్లో పెద్ద వయసులో(38) ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్​గా అశ్విన్ రికార్డుకెక్కాడు. 2024లో బంగ్లాపై చెన్నైలో 6 వికెట్లు పడగొట్టాడు.

బెన్ స్టోక్స్​ను 13సార్లు పెవిలియన్​కు పంపిన యాష్

టెస్టుల్లో ఒక బ్యాటర్ ఎక్కువ సార్లు అవుట్ చేసిన ప్లేయర్​గా అశ్విన్ నిలిచాడు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 13 సార్లు పెవిలియన్ కు పంపాడు.

సొంతగడ్డపై ఎక్కువ వికెట్లు

సొంతగడ్డపై ఎక్కువ వికెట్లు తీసిన రికార్డు అశ్విన్ పేరిట ఉంది. 65 మ్యాచ్ ల్లో యాష్ ఏకంగా 383 వికెట్లు పడగొట్టాడు.

డబ్ల్యూటీసీలో వేగంగా 100 వికెట్లు

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)లో వేగంగా 100 వికెట్ల తీసిన రికార్డు ఆశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా డబ్ల్యూటీసీలో 195 వికెట్లు తీశాడు.

టెస్టు క్రికెట్​లో అత్య‌ధిక సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ లు (11సార్లు) సొంతం చేసుకున్న భారత ఆట‌గాడిగా అశ్విన్ నిలిచాడు. మొత్తంగా (అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి) 12 సొంతం చేసుకున్నాడు. భార‌త క్రికెట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ (21), స‌చిన్ తెందూల్క‌ర్ (20)లు మాత్ర‌మే అత‌డి కన్నా ముందున్నారు.

అశ్విన్ రిటైర్మెంట్​పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

గబ్బాలో గట్టెక్కాం- మరి భారత్ WTC ఫైనల్ సంగతేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.