Money Hunting in YouTube : సామాజిక మాధ్యమాల మోజులో, రీల్స్ పిచ్చిలో పడి యువత చేస్తున్న ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. లైక్స్, వ్యూస్ కోసం వినూత్నంగా చేయాలని, ట్రెండింగ్‌లోకి రావాలని ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ట్రెండ్ అవ్వాలనే ఆలోచనతో వారు చేసే పనులు చిక్కుల్లోకి నెట్టెస్తున్నాయి. ఇటీవల కాలంలో మరీ ముఖ్యంగా మనీ హంట్ పేరిట వీడియోలు చేసి పలువురు కేసుల్లో బుక్ అవుతున్నారు.
ఏంటీ ఈ మనీ హంట్ : ఈ వీడియోలో వాళ్లు ఏం చేస్తారు అంటే. కొంత డబ్బు తీసుకుని ఎవరికైనా డబ్బులు అవసరమా, డబ్బులు కావాలా అంటూ స్టార్ట్ చేస్తారు. అలా ఒక ప్రదేశానికి వెళ్తారు. ఆ ప్లేస్ వివరాలన్నీ చెప్తారు. ఎక్కడకు వచ్చారు.. ఆ ప్లేస్‌కి ఎలా చేరుకోవాలి. ల్యాండ్ మార్క్స్‌తో సహా చెబుతారు. ఇలా చెప్పి వాళ్లు తీసుకొచ్చిన కొంత డబ్బులు ఒక చోట దాచిపెడతారు. అలా దాచిపెట్టి తీసుకోండి ఇక్కడికి వచ్చి అంటూ వదిలేసి వెళ్లిపోతారు. వాళ్లను ఫాలో అయినా వారో లేక వీడియో చూసిన వారో అక్కడికి వెళ్లి వాటిని తీసుకోడాని ప్రయత్నిస్తారు ఇలాంటి వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో విపరీతంగా పెరిగిపోయాయి.
యూట్యూబర్‌పై కేసు నమోదు : తాజాగా హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు పక్కన డబ్బులు పడేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పెట్టిన ఓ యూట్యూబర్‌పై ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలానగర్ చెందిన భానుచందర్ అనే యువకుడు మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరుతో రీల్ చేశాడు. ఇక్కడికి వచ్చి డబ్బులు తీసుకోండి అంటూ చెప్పాడు. ఈ వీడియో చూసిన పోలీసులు డబ్బులు కోసం ప్రజలు ఓఆర్‌ఆర్ పైకి భారీగా వచ్చే అవకాశముందని, ప్రమాదాలు సైతం జరిగే అవకాశం ఉందని కేసు నమోదు చేశారు.
తీరా మోసం : కొందరైతే కొన్ని యాప్‌లను, ఆటలను ప్రమోట్ చేయడానికి డబ్బులను రోడ్లపై విసురుతున్నారు. 'ఈ లింక్ వాడి బెట్టింగ్ పెట్టండి, డబ్బులు వస్తాయని' చూపిస్తూ విసురుతారు. అది చూసి నమ్మిన జనం నిజమేననుకొని బెట్టింగ్ పెట్టి మోసపోయినా ఘటనలు కోకొల్లలు. 'నా బయో లింక్ ఉంది ఓపెన్ చేసి నేను చెప్పే కోడ్‌తో ప్రెడిక్ట్ చేయండి' అంటూ వీడియోలో చెప్తారు. అలా లింక్ ఓపెన్ చేసి బెట్టింగ్ పెట్టిన వారికి మొదట్లో లాభాలు వచ్చినా తర్వాత అది మోసానికే దారి తీస్తుంది.
కాలయాపన చేస్తూ : ఒకప్పుడు సమాచారం కోసం వాడే సోషల్ మీడియాను ఇప్పుడు కాలయాపన చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. రేపటి భవిష్యత్తుకు ఆశాజనకంగా ఉండాల్సిన యువత ఇలాంటి పనులకు పాల్పడి ప్రాణాల మీదకు, కేసుల్లో ఇరుక్కొని ఊచలు లెక్కపెడుతున్నారు. సో అందుకే యువతకు ఒకటే సలహా.. ఇలాంటి వాటి నుంచి కాస్త దూరంగా ఉండండి.
హర్షసాయిపై రేప్ కేసు - ఇన్‌స్టాలో స్పందించిన యూట్యూబర్ - Rape Case on youtuber Harsha Sai