ICC Champions Trophy 2025 : టీమ్‌ఇండియాపై వీలు చిక్కినప్పుడల్లా సెటైర్లు వేస్తుంటారు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మోసిన్ నక్వీ. సందర్భం ఏదైనా సరే ఆయన దాన్ని భారత్‌తో ముడిపెట్టి మాట్లాడుతుంటారు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం స్టేడియాలు ఎప్పటికి రెడీ అవుతాయన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన, ఆ సమయంలోనూ భారత్‌పై తనకున్న ఆక్రోశాన్ని బయపెట్టారు.
"బయట నుంచి కామెంట్లు చేసే కొందరు తమ లిమిట్స్‌ను దాటుతున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. స్టేడియాలు ఇంకా పూర్తి కాలేదని, పాక్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ తరలిపోతుందంటూ బోర్డర్‌కు అవతలి నుంచి కూడా చాలా వ్యాఖ్యలు వినిపించాయి. అయితే, పీసీబీ అధ్యక్షుడిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఛాంపియన్స్ ట్రోఫీనే కాకుండా ట్రై సిరీస్‌ను కూడా మేము గ్రాండ్‌గానే నిర్వహిస్తాం. మేం చేసే ఈ ఏర్పాట్ల గురించి ఎన్ని కామెంట్లు వచ్చినా సరే అస్సలు వెనకడుగు వేయం. రాత్రింబవళ్లు పీసీబీ అధికారులు దీని కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. అన్ని జట్లకూ ఘనంగా స్వాగతం పలికేందుకు మేము సంసిద్ధమవుతున్నాం. వారి సేఫ్టీకి మేము బాధ్యత వహిస్తాం. టోర్నీ నిర్వహణకు మా నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండానే చూస్తున్నాం" అని నక్వీ వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 16న లాహోర్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు నిర్వహించనున్నట్లు నక్వీ తెలిపారు. గత సంప్రదాయాలకు భిన్నంగా ఈసారి కెప్టెన్లతో ఫొటోషూట్‌లు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు ఉండవని, కొన్ని జట్ల ట్రావెలింగ్ షెడ్యూల్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఓపెనింగ్ సెరిమనీకి సభ్య దేశాల క్రీడా మంత్రులతో పాటు కొందరు అధికారులకు ఆహ్వానం పంపిస్తామని అన్నారు. ఆతిథ్యదేశంగా అది తమ బాధ్యత అని పేర్కొన్నారు. భారత్ ప్రతినిధులను ఈ వేడుకకు పిలవనున్నట్లు తెలిపారు.
కరాచీలో తొలి మ్యాచ్
టోర్నమెంట్ మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 19న కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడతాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో ధనాధన్ బ్యాటర్లు- టాప్ 10 స్కోరర్లు- లిస్ట్‌లో ముగ్గురు మనోళ్లే!
'కెప్టెన్‌గా కూల్, ఫ్యాన్‌గా హాట్‌హాట్'- ఛాంపియన్స్ ట్రోఫీ ప్రోమో వైరల్