Sidhu Jonnalagadda Jack Movie : టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'జాక్'. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు. అయితే ఈ రిలీజ్ డేట్ ఇప్పుడు మూవీ లవర్స్‌లో తెగ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే?
'రాజాసాబ్' రిలీజ్ పక్కానా!
అయితే 'జాక్' రిలీజ్ డేట్ కంటే ముందే 'రాజాసాబ్' మేకర్స్ తమ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వాళ్లు కూడా 2025 ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానున్నట్లు గతంలోనే అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఇదే తేదీని సిద్ధు జొన్నలగడ్డ లాక్ చేసుకోవడం వల్ల 'రాజా సాబ్' విడుదలపై రూమర్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలో రాజాసాబ్ టీమ్ తప్పుకుందా లేకుంటే ఇద్దరూ ఒకే తేదీనా వస్తారా అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక 'జాక్' సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా కోసం డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఓ డిఫరెంట్ స్టోరీని సిద్ధం చేశారట. ఇందులో సిద్ధూ సరసన యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇక రాజా సాబ్ విషయానికి వస్తే హారర్ కామెడీ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయెల్ రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన బర్త్‌డేకు ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేయగా అందులో ఆయన కొత్త గెటప్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
మరోవైపు ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
హారర్ జానర్లో వరుస మూవీస్- భయపెట్టడానికి వస్తున్న మన స్టార్లు!
'1000 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం' - కోహినూర్ వజ్రం కోసం స్టార్ బాయ్ పోరాటం!