Rice Water For Healthy Skin : బియ్యం కడిగిన నీళ్లను అందరూ వృథాగా పారబోస్తుంటారు. కానీ.. ఆ వాటర్ వల్ల పొందే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఇకపై అలా చేయరు! ముఖ్యంగా సౌందర్య ప్రియులు రైస్ వాటర్‌ను సరిగ్గా వాడితే.. ఎలాంటి క్రీమ్స్, లోషన్స్ అవసరమే ఉండదంటున్నారు నిపుణులు. బియ్యం కడిగిన నీళ్లలో ఉండే పోషకాలు అందాన్ని రెట్టింపు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు. ఇంతకీ, చర్మానికి రైస్ వాటర్(Rice Water)అప్లై చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చర్మ సమస్యలు దూరం :బియ్యం కడిగిన నీళ్లలో అధికశాతంలో విటమిన్లు, మినరల్స్, అమైనో యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి.. చర్మాన్ని శుభ్రం చేసుకునే క్రమంలో ఈ నీటిని వాడటం ద్వారా మన చర్మం మృదువుగా మారుతుంది. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ రెబెక్కా మార్కస్.
ఫేషియల్ టోనర్ : రైస్ వాటర్‌ను మంచి ఫేషియల్ టోనర్‌గా వాడుకోవచ్చని చెబుతున్నారు. ఒక కాటన్ ప్యాడ్‌పై ఈ నీటిని పోసి.. దానితో ముఖంపై స్మూత్‌గా అప్లై చేయాలి. అలా కొన్ని నిముషాలు ఉంచాక చల్లని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో కనీసం రెండుసార్లు చేస్తే చర్మం మృదువుగా మారి.. స్కిన్‌పై ఉన్న ముడతలు తగ్గుతాయంటున్నారు.
మొటిమలు, మచ్చలు తగ్గుతాయి : గంజి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు. అలాగే రైస్ వాటర్‌లోని పోషకాలు కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తాయని చెబుతున్నారు.
జనరేషన్ గ్యాప్ గురూ - ఆరోగ్యానికి గంజి అమృతమని మీకు తెలుసా! - ఆ సమస్యలన్నీ దూరం!
సన్‌బర్న్స్ నుంచి రిలీఫ్ :బయట ఎండకు తిరిగినప్పుడు సున్నితమైన ప్రదేశాల్లో స్కిన్ కందిపోతుంటుంది. అలాంటి సమయాల్లో బియ్యం కడిగిన వాటర్‌ని ఉపయోగించడం ద్వారా చాలా చక్కటి ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఇందుకోసం ఒక కాటన్ ప్యాడ్‌పై ఈ నీటిని కొద్దిగా వేసి కందిపోయిన ప్రదేశాల్లో స్మూత్‌గా అప్లై చేయాలి. దీనివల్ల మంట తగ్గుతుంది. చర్మం మృదువుగా తయారవుతుందని చెబుతున్నారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ రెబెక్కా మార్కస్.