Peeing in the Shower Good or Bad: మనలో చాలా మంది స్నానం చేసే సమయంలో మూత్రం పోస్తుంటారు. ఓ సంస్థ చేపట్టిన సర్వేలో 58శాతం మంది ప్రజలు స్నానం చేసేటప్పుడు మూత్రం పోస్తామని తెలిపారు. బ్రిటన్లో జరిగిన మరో సర్వేలో సగానికి పైగా మంది పురుషులు స్నానంలో మూత్రం పోస్తున్నట్లు అంగీకరించారు. కానీ, ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని అంశాలపై మాట్లాడేందుకు సిగ్గుపడుతుంటారు. మరి ఇలా చేస్తే ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా అన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. ఈ నేపథ్యంలోనే ఇది ఆరోగ్యానికి మంచిదేనా? లేదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా చేయడం వల్ల నీరు ఆదా అవుతుందా?
స్నానం చేసే క్రమంలో మూత్రం పోయడం వల్ల నీరు ఆదా అవుతుందని నిపుణులు చెబుుతున్నారు. ప్రస్తుతం టాయిలెట్లు ఒక ఫ్లష్కు 3 లీటర్ల కంటే తక్కువ నీరు అవసరం పడుతుందని అమెరికాలోని ఓ సంస్థ చెబుతోంది. అదే పాత తరం టాయిలెట్లు ఒక ఫ్లష్కు కనీసం 10 లీటర్ల పైనే నీటిని తీసుకున్నట్లు వెల్లడించింది. ఫలితంగా ప్రతిరోజు సుమారు 350 లీటర్లకుపైగా నీటిని వాడుతున్నట్లు వివరించింది. స్నానం చేసేటప్పుడు మూత్రం పోయడం వల్ల ఫ్లష్ చేసే నీటిని ఆదా చేసి పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుందన్నారు.

స్నానం చేసే సమయంలో మూత్రం పోయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. ఇది హానికరమైనది కాకపోయినా.. కానీ వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని డాక్టర్ నికేత్ సోన్పాల్ సూచించారు. మూత్రకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు ఇలా చేయడం వల్ల అవి మిగతావారికి సోకే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా కాలిలో ఏదైనా గాయం తగిలి ఉంటే ఇది మరింత ప్రమాదమని తెలిపారు. అందుకోసమే పబ్లిక్ టాయిలెట్లు కాకుండా వ్యక్తిగత బాత్రూమ్ ఉపయోగించడం సురక్షితమైనదని అంటున్నారు. వ్యక్తిగత బాత్రూమ్ అయితే, ఇలా మూత్రం పోసే ప్రదేశాన్ని సబ్బునీటితో శుభ్రం చేయాలని సూచిస్తున్నారు. 2018లో Journal of Environmental Healthలో ప్రచురితమైన "The Hygiene of Urination"అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. ఇందులో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా డాక్టర్ Jane Smith పాల్గొన్నారు.

మూత్రం పోస్తే ఇన్ఫెక్షన్ పోతుందా?
ముఖ్యంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో కాలిపై మూత్రం పోస్తే ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు తొలగిపోతాయని భావిస్తుంటారు. మూత్రంలో యూరియా ఉంటుందని.. ఇది అనేక సమస్యల పరిష్కరానికి ఉపయోగపడుతుందని అంటుంటారు. కానీ దీనిపై ఎలాంటి పరిశోధన ఆధారాలు లేవని నిపుణులు వెల్లడించారు. మూత్రంలో అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుందని.. ఇది అంతగా సురక్షితం కాదని వివరించారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
షుగర్ పేషెంట్లు రోజుకు ఎన్నిసార్లు తినాలి? మూడు సార్లు మాత్రం కాదట! మరెంతో తెలుసా?
యూరిక్ యాసిడ్తో ఇబ్బందా? అసలు గౌట్ ఎలా వస్తుందో తెలుసా? తాజా పరిశోధనలో కీలక విషయాలు