Plant Protein Vs Animal Protein Which one is Better: ఆరోగ్యంగా ఉండటానికి ప్రొటీన్ అద్భుతమైన పోషకం. పిండి పదార్థం శరీరానికి శక్తిని సమకూరిస్తే, కొవ్వు శక్తిని దాచుకొని అవసరమైనప్పుడు తిరిగి అందిస్తుంది. ఈ రెండింటికీ మధ్య వారథిగా పనిచేసేవి ప్రొటీన్లే. శరీరంలో జరిగే జీవక్రియలన్నీ వీటి రూపంలోనే సాగుతాయి. విటమిన్లు, హార్మోన్లు, ఎంజైమ్‌లు, యాంటీబాడీలు, హిమోగ్లోబిన్ వంటివన్నీ ప్రొటీన్లే. అవయవాలు, కండరాలు, నాడీ వ్యవస్థ, రక్త నాళాలు, అస్థి పంజరం అన్నీ వీటితో తయారైనవే. అన్నీ వీటి మీద ఆధారపడినవే. మరి.. మొక్కల ఆధారిత ప్రొటీన్లు మంచివా? మాంసాహార ప్రొటీన్లు మంచివా??
జంతు, మొక్కల ప్రొటీన్ల మధ్య వ్యత్యాసం:శాఖాహారం, మాంసాహార ప్రొటీన్ల మధ్య వ్యత్యాసం.. వాటిలో ఉండే అమైనో ఆమ్లాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. జంతువుల ఉత్పత్తులలో మొత్తం తొమ్మిది అమైనో ఆమ్లాలను అందించే ప్రొటీన్ ఉంటుంది. చేపలు, గుడ్లు, రెడ్ మీట్, చికెన్ వంటి పౌల్ట్రీ ఉత్పత్తులు వీటికి ఉదాహరణలు. మరోవైపు.. మొక్కల ఉత్పత్తులలో ఇన్ని అమైనో ఆమ్లాలు ఉండవు. అందువల్ల పూర్తి ప్రొటీన్ పోషణ సామర్థ్యం శాకాహారంలో కాస్త తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ.. క్వినోవా, బుక్వీట్ వంటి మొక్కల ఉత్పత్తుల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. జంతు ప్రొటీన్లలో అధిక ప్రొటీన్ కంటెంట్ ఉన్నప్పటికీ.. వాటికి అదనపు రక్షణ కారకాలు లేవు. అందువల్ల.. మొక్కల నుంచి లభించే ప్రొటీన్ కూడా మంచిదే అంటున్నారు.
డయాబెటిస్ తగ్గుతుందని హై ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నారా? మీరు డేంజర్లో ఉన్నట్లే!
జంతు, మొక్కల ప్రొటీన్ల మధ్య తేడాలు:మొక్కల ప్రొటీన్, జంతు ప్రొటీన్ పోషక కూర్పు విభిన్నంగా ఉంటుంది. బీన్స్, చిక్కుళ్లు, ధాన్యాలలో కనిపించే మొక్కల ప్రొటీన్లు సాధారణంగా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని, జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. అయితే.. వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉండవు.
ఇక మాంసం, చేపలు, పాలలో సమృద్ధిగా ఉన్న జంతు ప్రోటీన్లు.. కండరాల పెరుగుదలకు అవసరమైన పూర్తి అమైనో ఆమ్లాలను అందిస్తాయి. శక్తి ఉత్పత్తికి, ఎర్ర రక్త కణాల నిర్మాణానికి కీలకమైన హీమ్ ఐరన్, విటమిన్ B12 కూడా ఇవి కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి చక్కటి ప్రయోజనాలను అందిస్తాయి.