CCPA On Ola Uber Fares Prices : ధరల వత్యాసాలు, సాఫ్ట్‌వేర్ అప్డేట్పై వినియోగాదరుల ఫిర్యాదుల మేరకు టెక్ దిగ్గజం యాపిల్, క్యాబ్ అగ్రిగేటర్స్ ఓలా, ఉబర్ సంస్థలకు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ నోటీసులు పంపింది. ఫిర్యాదులపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గురువారం ఆయా సంస్థలకు ఈ మేరకు తాఖీదులు ఇచ్చినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
ఇటీవల తమ ఐఫోన్‌లలో ఐవోఎస్ 18+ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసిన తర్వాత సమస్యలు వస్తున్నట్లు యూజర్లు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారని ప్రహ్లాద్ జోషి అన్నారు. వచ్చిన వినతులు పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రతిస్పందనను కోరుతూ సీసీపీఏ యాపిల్‌కు నోటీసులు ఇచ్చినట్లు జోషి ఎక్స్ వేదికగా వెల్లడించారు.
After receiving complaints on the National Consumer Helpline regarding performance issues in #iPhones following the iOS 18+ software update, the department, after examining these grievances, has issued a notice to #Apple through the CCPA, seeking a response on the matter.
— Pralhad Joshi (@JoshiPralhad) January 23, 2025
'వినియోగదారలు ఉపయోగిస్తున్న ఫోన్స్(ఆండ్రాయిడ్, ఐఫోన్) మోడళ్ల ఆధారంగా ప్రయాణ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు గమించాం. ఈ క్రమంలోనే ప్రధాన క్యాబ్ అగ్రిగేటర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేశాం. ఈ ఫిర్యాదులపై త్వరలో పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతున్నాం' అని ప్రహ్లాద్ జోషి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Union Minister Pralhad Joshi tweets, " as a follow-up to the earlier observation of apparent differential pricing based on the different models of mobiles (iphones="" android) being used, department of consumer affairs through the ccpa, has issued notices to major cab aggregators… pic.twitter.com/ewtdXfWfkR
— ANI (@ANI) January 23, 2025
ఫోన్స్ మోడళ్ల ఆధారంగా వ్యత్యాసం
గత కొద్ది రోజులగా క్యాబ్ ఛార్జీల విషయంపై వినియోదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మోడళ్లతో పాటు ఫోన్ ఖరీదును బట్టి కూడా వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఒక రైడ్ కోసం ఒకేసారి ఆండ్రాయిడ్, ఐఫోన్లో బుక్ చేస్తే వేర్వేరు ఛార్జీలు చూపిస్తున్నట్లు ఫొటోలు పేడుతున్నారు. వాటిల్లో యూజర్లకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేసినట్లు ఉన్నాయి. ఓ వ్యక్తి రెండు వేర్వేరు ఫోన్ల నుంచి ఒకే రైడ్‌ను బుక్ చేస్తే రెండు వేర్వేరు ధరలను చూపించిందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తన కుమార్తె ఫోన్‌తో పోలిస్తే తన మొబైల్ నుంచి ఎక్కువ ధర చూపిస్తుందని తెలిపారు.
Same pickup point, destination & time but 2 different phones get 2 different rates. It happens with me as I always get higher rates on my Uber as compared to my daughter’s phone. So most of the time, I request her to book my Uber. Does this happen with you also? What is the hack? pic.twitter.com/bFqMT0zZpW
— SUDHIR (@seriousfunnyguy) December 23, 2024
బ్యాటరీ పర్సంటేజీ బట్టి ఛార్జీల్లో తేడా
ఇటీవల ఫోన్ బ్యాటరీ పర్సంటేజీ తక్కువగా ఉన్నప్పుడు క్యాబ్ సంస్థ ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తోందంటూ దిల్లీకి చెందిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అయితే క్యాబ్ సర్వీసులు అందించే ఉబర్ సంస్థ ఫోన్ మోడళ్ల ఆధారంగానే కాదు, అందులో ఉన్న బ్యాటరీ పర్సంటేజీ బట్టి కూడా ఛార్జీల్లో వ్యత్యాసం చూపిస్తోందని తెలిపారు. రెండు ఆండ్రాయిడ్, రెండు ఐఓఎస్ డివైజులు వినియోగించి పరిశీలించినప్పుడు దీన్ని గుర్తించినట్లు చెప్పారు. అన్ని డివైజుల్లోనూ ఒకే అకౌంట్‌తో లాగిన్ అయి ఒకే ప్రదేశానికి రైడ్ బుక్ చేసినప్పుడు ఫేర్‌లో ఈ తేడా గుర్తించినట్లు పేర్కొన్నారు.
The Curious Case of Uber Fare Discrepancies:
— Rishabh Singh (@merishabh_singh) January 18, 2025
Platform and Battery Impact
Ride-hailing platforms like Uber have revolutionized transportation, but recent observations raise questions about the transparency of their pricing algorithms.
In this post, I’ll dive into two surprising… pic.twitter.com/nlQCM0Z49B