How To Prevent Stomach Ulcers :ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తోన్న అనారోగ్య సమస్యలలో అల్సర్ ఒకటి. అజీర్తిఅనేది తీవ్రరూపం దాల్చినప్పుడు అల్సర్‌గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, తీవ్రమైన, ఒత్తిడి, ఆందోళనలు, స్మోకింగ్, మద్యం తాగడం వంటి వివిధ కారణాల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల అల్సర్ సమస్యను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
అల్సర్ లక్షణాలు :
- జీర్ణశయంలో అల్సర్ ఏర్పడటం వల్ల కడుపులో నొప్పి, మంటగా ఉంటుంది.
- గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉంటుంది.
- కడుపులో గడబిడలతో పుల్లటి తేన్పులు వస్తాయి.
- తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం.
- ఈ సమస్య వల్ల కొంతమంది రక్తహీనతతో బాధపడతారు. అలాగే బరువు కూడా తగ్గే అవకాశం ఉంది.
- వాంతులు అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులంటున్నారు.
ఈ ఆహార పదార్థాలు తీసుకోండి :
క్యారెట్ :రోజూ క్యారెట్ తినడం వల్ల అల్సర్ ప్రమాదం తగ్గుతుందని.. ఇందులోని విటమిన్ ఎ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో 'Nutrients' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం.. ప్రకారం క్రమం తప్పకుండా క్యారెట్ తినడం వల్ల అల్సర్ తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో బీజింగ్‌లోని చైనా మెడికల్ యూనివర్సిటీలో న్యూట్రిషన్ అండ్ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ 'డాక్టర్ జియాంగ్ లియు' పాల్గొన్నారు. అల్సర్ సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకండా క్యారెట్ తినడం వల్ల ఈ సమస్య తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
చర్మంపై దద్దుర్లు వేధిస్తున్నాయా? - ఈ రెమెడీస్‌తో ఆల్ సెట్ ! - Home Remedies for Skin Allergy
గుమ్మడికాయ :అల్సర్ సమస్యతో బాధపడేవారికి గుమ్మడికాయ మంచి ఔషధంలా పనిచేస్తుందని.. ఇందులోని పోషకాలు, విటమిన్‌లు పొట్టను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు.