Health Benefits Of Cucumber :సమ్మర్‌లో చాలా మంది కీర దోసకాయ తింటూ ఉంటారు. వీటిని తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉండటంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలనుపొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఎండాకాలంలో దోసకాయలను తినడం వల్ల మన శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయో మీకు తెలుసా? ఇప్పుడు చూద్దాం.
హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది :
దోసకాయలను పచ్చిగా లేదా వండుకొని కూడా తినొచ్చు. వీటిని ఎలా తీసుకున్నా కూడా మన శరీరానికి పోషకాలు అందుతాయి. వీటిలో 96 శాతం వరకు నీరు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలంలో దోసకాయ తినడం వల్ల బాడీని హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవచ్చని అంటున్నారు.
ఎముకలు బలంగా :
కీర దోసకాయలో విటమిన్ కె, క్యాల్షియం వంటివి ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే ఎముకలు విరిగే ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది :
దోసకాయలో నీటి శాతం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా చేస్తాయి. దీనిని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే మలబద్ధకం సమస్యతో బాధపడేవారి వీటిని డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.
బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ఉంటే - ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా ? - Brain Tumor Symptoms
బరువు తగ్గుతారు :
దోసకాయలో క్యాలరీలు, పిండి పదార్థాలు, చక్కెర తక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దోసకాయలో ఉండే పీచు పదార్థం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల తొందరగా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గే అవకాశం ఉంది. 2007లో 'న్యూట్రిషన్ రీసర్చ్ జర్నల్'లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. దోసకాయ సలాడ్ తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో టెక్సాస్ A&M యూనివర్సిటీకి చెందిన 'డాక్టర్ డానా డి.జాన్సన్' పాల్గొన్నారు. దోసకాయ సలాడ్ తినడం వల్ల వెయిట్‌లాస్ అయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.