Winter Skin Care Tips: శీతాకాలంలో ముఖానికి ఎన్ని క్రీములు రాసినా సరే.. చలిగాలుల ప్రభావం నుంచి తప్పించుకోవడం కష్టంగా ఉంటుంది. ఫలితంగా ముఖం పొడిబారిపోయి ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే చలికాలంలో ఈ శీతగాలుల నుంచి చర్మాన్ని రక్షించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజును క్లెన్సింగ్‌తోనే మొదలుపెట్టాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలోనే చర్మంలోని సహజ నూనెలు దూరమవ్వకుండా క్రీమ్ లేదా నూనె ఆధారిత క్లెన్సర్‌ను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా చర్మంలోని మృతకణాలను ఎప్పటికప్పుడు తొలగిస్తేనే చర్మం కాంతివంతంగా ఉంటుందని చెబుతున్నారు. కానీ ఈ కాలంలో చర్మం సున్నితంగా మారుతుందని.. కాబట్టి, మైల్డ్ ఎక్స్‌ఫోలియేటర్‌తో వారానికి రెండుసార్లు శుభ్రపరచాలని సలహా ఇస్తున్నారు.
టోనర్: ఇందుకోసం ఆల్కహాల్ ఫ్రీ టోనర్‌ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సీజన్‌లో గ్లిజరిన్, గులాబీనీరు, కలబంద ఉన్న టోనర్ ఏదైనా మంచిగానే ఉంటుందని సలహా ఇస్తున్నారు. ఇది చర్మాన్ని తాజాగా, తేమగా, మృదువుగా మారుస్తుందని వివరిస్తున్నారు. ఇంకా చర్మరంధ్రాలను శుభ్రపరిచి దద్దుర్లు, పొడారడం వంటి సమస్యలకు చెక్ పెడుతుందని వివరిస్తున్నారు.
మాయిశ్చరైజర్: మనలో చాలా మంది ఏదో ఒకటి అని మార్కెట్లో దొరికే మాయిశ్చరైజర్‌లు వాడుతుంటారు. కానీ, సెరమైడ్స్, షియాబటర్ లేదా కొవ్వు ఆమ్లాలు ఉన్న మాయిశ్చరైజర్ ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆపై సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలని.. ఇది ఎండ నుంచి హాని కలగకుండా నిరోధిస్తూనే ముందస్తు వృద్ధాప్యఛాయలను దరిచేరనీయదని వివరిస్తున్నారు. ఇంకా ఎస్‌పీఎఫ్30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ఎంపిక చేసుకోవాలని తెలిపారు.
ఆరోగ్యంగా: ముఖ్యంగా చలికాలంలో చర్మ ఆరోగ్యానికి పైపై పూతలే చాలవని.. తప్పనిసరిగా లోపలినుంచీ పోషణ కావాలని నిపుణులు అంటున్నారు. అందుకే ప్రతిరోజూ తగినంత నీరు తప్పనిసరిగా తాగాలని సలహా ఇస్తున్నారు. 2020లో Journal of Clinical and Aesthetic Dermatologyలో ప్రచురితమైన "The importance of skin barrier function in maintaining skin hydration" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. ఇంకా హెర్బల్ టీలతో చర్మంపై ముడతలు, గీతలు రాకుండా ఉంటాయని వివరిస్తున్నారు. రాత్రుళ్లూ ముఖాన్ని మృదువైన క్లెన్సర్‌తో శుభ్రపరుచుకోవాలని.. ఆపై కలబందలో విటమిన్ ఈ, బాదంనూనె కలిపిన మిశ్రమాన్ని తప్పనిసరి రాయాలని అంటున్నారు. ఇది పొడిబారే ప్రభావాన్ని తగ్గించి ఉదయానికి ముఖాన్ని తాజాగా మారుస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
సడెన్‌గా వెజిటేరీయన్గా మారితే ఏం జరుగుతుంది? మాంసాహారంలో ఉండే పోషకాలన్నీ ఉంటాయా?
మహిళల్లో ఈ విటమిన్లు తప్పక ఉండాలట- అవేంటి? ఎందులో లభిస్తాయో మీకు తెలుసా?