Health Benefits of Amla Tea in Telugu:చలికాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సీజన్‌లో శరీరం నిస్తేజంగా మారడమే కాదు.. వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుంది. వైరస్‌లు, బ్యాక్టీరియాలు వేగంగా శరీరంలోకి చేరి.. జలుబు, దగ్గు, జ్వరాలు ఇబ్బందిపెడుతుంటాయి. ఇలాంటి సమయంలో ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు తీసుకోవాలి. తద్వారా ఎలాంటి రోగాలతో అయినా పోరాడే సామర్థ్యం లభిస్తుంది. అలా ఇమ్యూనిటీ అందించే ఫుడ్స్‌లో ఉసిరితో తయారయ్యే టీ కూడా ఒకటి. మరి దీని వల్ల కలిగే ప్రయోజనాలు, ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఉసిరి టీ ఆరోగ్య ప్రయోజనాలు:
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది: ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరస్తుందని.. ఫలితంగా శరీరం బాక్టీరియా, వైరస్‌లతో సమర్థవంతంగా పోరాడగలుగుతుందని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శుభాంగి తమ్మళ్వార్ అంటున్నారు. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జలుబువల్ల కలిగే గొంతు నొప్పి, వాపు వంటి లక్షణాలను తగ్గిస్తాయని అంటున్నారు.
జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : ఉసిరి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు. ముఖ్యంగా మలబద్ధకాన్ని నివారిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఉసిరి.. జీర్ణ రసాల స్రావాన్నీ ప్రేరేపించి పోషకాల శోషణను మెరుగుపరుస్తుందని.. ఫలితంగా అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతాయంటున్నారు.
కళ్ల ఆరోగ్యానికి మంచిది: ఉసిరి కళ్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుందని, గ్లాకోమా వంటి కంటి సమస్యలను నివారిస్తుందని అంటున్నారు. అలాగే ఉసిరిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కంటి వాపును తగ్గించి.. కంటి ఎరుపు, దురద వంటి సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: ఉసిరిలో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయని.. రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు తగ్గుతాయని అంటున్నారు. 2020లో జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఆమ్లా సారం గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుందని, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని కనుగొన్నారు.
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది: ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుందని అంటున్నారు. తద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గుతుందని అంటున్నారు.