Garlic Under Pillow Benefits :భారతీయ వంటకాల్లో వెల్లుల్లి లేకుండా వంటకు మంచి, రుచి రావడం అసాధ్యమనే చెప్పాలి. అలా మనం సాధారణంగా వాడేసే వెల్లుల్లి కేవలం సువాసన, రుచి కోసం మాత్రమే కాకుండా మనకు తెలియని ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందట. దీనిని నేరుగా తీసుకోవడం వల్ల చాలా రకాల లాభాలు పొందవచ్చట. నేరుగా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు అనే విషయం తెలిసిందే కదా అనుకోకండి. ఇది నిజమా అబద్దమా అనే విషయం పక్కన పెడితే ఇదే కాకుండా మనిషికి చాలా అవసరమైన నిద్ర విషయంలో వెల్లుల్లి చాలా బాగా సహాయపడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు దిండు కింద వెల్లుల్లి రెబ్బ పెట్టుకుని పడుకుంటే సైంటిఫిక్గా చాలా ప్రయోజనాలు ఉన్నాయట.
వెల్లుల్లిలో ఉండే న్యూట్రియంట్లు, విటమిన్- బీ6, థయామిన్, పాంటాతెనిక్ యాసిడ్, విటమిన్-సీలతో పాటు మాంగనీస్, పాస్పరస్, కాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి బహుళ ప్రయోజనాలు సమకూరుస్తాయట. పడుకునే ముందు దిండు కింద వెల్లుల్లి పెట్టుకోవడం వల్ల దోమల బెడద తగ్గుతుందట. గదంతా మంచి సువాసనను వెదజల్లుతుందట. ఫలితంగా జలుబు, దగ్గు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా ఇన్సోమ్నియాతో బాధపడే వారికి కూడా సహాయం చేస్తుందట. వెల్లుల్లిలో ఉండే విటమిన్లు బీ1, బీ6లు వల్ల మెలటోనిన్ నరాలకు అంది ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుందట. వీటిల్లో ఉండే యాంటీ టాక్సిన్ గుణాలు, బిగుసుకుపోయిన ముక్కును క్లియర్ చేసి ఇన్ఫెక్షన్లను, శ్వాస సమస్యలను దూరం చేస్తుంది.