ETV Bharat / health

డాక్టర్​ను అడగకుండానే టెస్టులు చేసుకుంటున్నారా? సొంత వైద్యంతో గుండెకు ముప్పు తప్పదట! - HEART TEST WITHOUT DOCTOR CONSULT

-నేరుగా సీటీ యాంజియో చేయించుకోవడం వల్ల నష్టం -మరి ఈ పరీక్ష ఎప్పుడు? ఎన్ని రోజులకు చేయించుకోవాలి?

HEART TEST WITHOUT DOCTOR CONSULT
HEART TEST WITHOUT DOCTOR CONSULT (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Jan 25, 2025, 12:17 PM IST

Heart Test Without Doctor Consultation: మనకు తెలిసిన వారికి గుండెపోటు వచ్చిందని తెలియగానే చాలా మంది.. మాకు ఫలానా టెస్టులు చేయండని వైద్యులనే అడుగుతున్నారు. ఇంకొంత మంది నేరుగా పరీక్ష కేంద్రాలకు వెళ్లి సీటీ యాంజియోగ్రామ్‌ చేయించుకుంటున్నారు. అప్రమత్తత పేరుతో ఇలా చేయడం వల్ల లాభం కన్నా.. నష్టమే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు గుండె పరీక్షలు ఎప్పుడు అవసరం? సీటీ యాంజియోగ్రామ్‌ ఎవరు చేయించుకోవాలి? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం చాలా మందిలో ఆహారపు అలవాట్లు మారిపోయాయని.. సరైన నిద్ర, శారీరక శ్రమ ఉండడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా మానసిక ఒత్తిడి పెరిగి.. 30-40 ఏళ్ల వయసులోనే అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవన శైలి రుగ్మతల బారినపడుతున్నారని అంటున్నారు. ఇండియన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (ఐహెచ్‌ఏ) గణాంకాల ప్రకారం.. దేశంలో మరణాలకు కారణాల్లో గుండెపోటు మొదటి స్థానంలో ఉందని వివరిస్తున్నారు. ఒకరికి వచ్చింది కదాని.. మనకూ గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయని భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. కానీ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని సూచిస్తున్నారు.

ఏమిటీ పరీక్ష?

  • ఈ పరీక్షలో భాగంగా ప్రామాణిక యాంజియోగ్రామ్‌లో రక్తనాళంలోకి కాథటర్‌ను ప్రవేశపెట్టి గుండె రక్తనాళాల్లో పూడికలను పరీక్షిస్తారు. పూడికలుంటే వెంటనే స్టెంట్‌ కూడా వేస్తారని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం ఒకరోజు హాస్పిటల్‌లో చేరాల్సి ఉంటుందని.. ఈ ప్రక్రియలో కొంత ప్రమాదం ఉందని వివరిస్తున్నారు.
  • సీటీ యాంజియో టెస్టును సాధారణ స్కానింగ్‌ మాదిరిగానే చేయించుకోవచ్చు. దీనికోసం హాస్పిటల్‌లో చేరాల్సిన అవసరం లేదు.
  • అయితే, కొందరు సీటీ యాంజియోను పదే పదే చేయించుకుంటుంటారు. ఇది సరికాదని ఒక సీటీ యాంజియో.. 20 ఎక్స్‌రేలతో సమానమని నిపుణులు చెబుతున్నారు. ఇలా పదే పదే చేయిస్తే రేడియేషన్‌ ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

సీటీ యాంజియో ఎప్పుడు? ఎన్ని రోజులకు చేయించుకోవాలి?

  • టీఎంటీ టెస్ట్‌లో పాజిటివ్‌ వచ్చి.. కానీ గుండెపోటుకు సంబంధించిన ఇతర లక్షణాలేమీ లేకపోతే సీటీ యాంజియో చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
  • ఒక వ్యక్తి ఛాతీనొప్పితో అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్‌కు వచ్చారు. ఈసీజీ, 2 డి ఎకో నార్మల్‌గానే ఉన్నాయి. కానీ ఇది గుండెపోటు కాదని నిర్ధరించలేని పరిస్థితిలో తక్షణ ఫలితాల కోసం తప్పనిసరిగా ఈ పరీక్ష చేయాలని అంటున్నారు.
  • కొందరు బైపాస్‌ ఆపరేషన్‌ చేయించుకున్న పదేళ్ల తర్వాత, పాత రికార్డులు లేకుండానే డాక్టర్‌ వద్దకు వస్తుంటారు. ఇలాంటప్పుడు వారి గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఈ టెస్ట్ అవసరం అవుతుందని అంటున్నారు.
  • సాధారణంగా 40 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా ఏడాదికి ఒకసారి జీవక్రియలకు సంబంధించిన పరీక్షలు, ఈసీజీ, 2 డి ఎకో, టీఎంటీ వంటి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా కుటుంబంలో గుండెపోటు చరిత్ర ఉన్నవారు 35 ఏళ్ల నుంచి ఏడాదికి ఒకసారి ఈ పరీక్షలు చేయించుకోవాలని అంటున్నారు.
  • వీటితో పాటు సీటీ యాంజియోగ్రామ్‌ పరీక్ష కూడా చేయించుకోవాలని తెలిపారు. అయితే, ఈ పరీక్ష నార్మల్‌గా ఉంటే.. మళ్లీ ఐదేళ్ల వరకూ ఈ పరీక్షతో పనిలేదని సలహా ఇస్తున్నారు. కానీ, మిగిలిన పరీక్షలను మాత్రం ఏడాదికోసారి చేయించుకుంటే చాలని పేర్కొన్నారు.

"సీటీ యాంజియోగ్రామ్‌ పరీక్ష చేయడానికంటే ముందు.. సీటీ క్యాల్షియం స్కోర్‌ టెస్ట్‌ చేస్తారు. ఇందులో గుండె రక్తనాళాల్లో క్యాల్షియం నిల్వల గురించి తెలుస్తుంది. అందులో ఫలితాలను బట్టి సీటీ యాంజియో టెస్ట్ చేస్తారు. ఒకవేళ క్యాల్షియం స్కోర్‌ మరీ ఎక్కువగా ఉంటే.. సీటీ యాంజియో కంటే రెగ్యులర్‌ యాంజియోగ్రామ్‌ టెస్ట్ చేయడం మంచిది. కార్డియాలజిస్ట్‌ పర్యవేక్షణలో కాకుండా నేరుగా కొన్ని డయాగ్నస్టిక్‌ సెంటర్లకు వెళ్లి సీటీ స్కాన్, సీటీ యాంజియో చేయించుకుంటే.. అక్కడ కేవలం టెక్నీషియన్‌ మాత్రమే ఉంటారు. వాళ్లు ఈ క్యాల్షియం స్కోర్‌ వంటివేమీ పట్టించుకోకపోవడం వల్ల సరైన ఫలితాలు రావు. సీటీ యాంజియోలో ఎంత కాంట్రాస్ట్‌ ఇస్తున్నారనేది మరో ముఖ్యమైన విషయం. సాధారణంగా సీటీ యాంజియోలో 80 ఎంఎల్‌ ఇంజక్షన్‌ ఇస్తుంటారు. అదే నార్మల్‌ యాంజియోగ్రామ్‌లో 20-25 ఎంఎల్‌లో టెస్ట్ చేయవచ్చు. ఇంకా కిడ్నీ వ్యాధులున్న వారిలో కాంట్రాస్ట్‌ ఇంజక్షన్‌ ఎంత తక్కువ మోతాదులో వాడితే అంత మేలు చేస్తుంది. గుండె పంపింగ్‌ బలహీనంగా ఉన్నవారిలోనూ 80 ఎంఎల్‌ కాంట్రాస్ట్‌ ఇంజక్షన్‌ ఇస్తే.. వారిలో ఆయాసం పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వారిలో సీటీ యాంజియో కంటే సాధారణ యాంజియోనే మంచిది. అయితే, రోగికి సీటీ యాంజియోనా? రెగ్యులర్‌ యాంజియోనా? అని నిర్ణయించాల్సింది కార్డియాలజిస్ట్‌ మాత్రమే. రేడియాలజిస్ట్, కార్డియాలజిస్ట్‌ కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడే రోగికి మేలు"

--డాక్టర్‌ శరత్‌రెడ్డి అన్నం, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌

వైద్యులపై ఒత్తిడి వద్దు
ఇంకా ఈ మధ్య కాలంలో చాలా మందికి ఇంటర్నెట్‌లో వైద్య సమాచారం తెలుసుకోవడం ఎక్కువైంది. ఫలితంగా గుండె రక్తనాళాల్లో పూడికలు సీటీ యాంజియోతో తెలుస్తాయని నేరుగా ఆ పరీక్ష కోసం వెళుతున్నారని చెబుతున్నారు. అయితే రెగ్యులర్‌ స్క్రీనింగ్‌ చేయకుండా.. సీటీ యాంజియోకు వెళ్లకూడదని నిపుణులు సూచిస్తున్నారు. లిపిడ్‌ ప్రొఫైల్, ఈసీజీ, 2డి ఎకో, టీఎంటీ వంటి పరీక్షల తర్వాతే, అవసరమైతేనే సీటీ యాంజియోగ్రామ్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇంకా నిపుణులైన వైద్యులు చెబితేనే ఆ పరీక్ష చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కొవ్వు కరిగి సిక్స్ ప్యాక్ కావాలా? ఖర్చు లేకుండానే ఈజీగా వస్తుందట!

నల్లద్రాక్షతో గుండె జబ్బులు, క్యాన్సర్​కు చెక్- కానీ వారు మాత్రం ఎక్కువగా తినకూడదట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.