ETV Bharat / state

కోర్టు మెట్లెక్కిన పందెం కోడి - న్యాయమూర్తి ఏం చేశారంటే? - POLICE PRODUCED THE COCK IN COURT

కోడి పందేల్లో కోడిపుంజును అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు - కోడి పుంజును వేలం వేయించిన న్యాయమూర్తి - ఎంతకి అమ్ముడు పోయిందంటే?

Police Produced the Cock in Court
Police Produced the Cock in Court (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2025, 5:45 PM IST

Police Produced the Cock in Court : కోడి పందేల్లో అరెస్ట్ అయిన ఓ కోడి పుంజు కోర్టు మెట్లు ఎక్కింది. కోడిపుంజు తప్పేం లేదని తేలడంతో దాన్ని వేలం వేయాలని న్యాయమూర్తి నిర్ణయించారు. వేలంలో ఓ వ్యక్తి స్వాధీనం చేసుకోగా, కోసి తినేస్తారేమోనని ఆ కోడి పుంజు ఆందోళనకు గురైంది. తాను జీవ హింస చేయనని, సన్మానించి పెంచుకుంటానని న్యాయమూర్తితో చెప్పడంతో ఆ కోడిపుంజు ఊపిరి పీల్చుకుంది. అసలు విషయంలోకి వెళితే,

సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పీఎస్ పరిధిలోని అజీజ్‌ నగర్ పోచయ్య తోట వెనుక కొందరు కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఎస్‌వోటీ పోలీసులు రైడ్ చేశారు. 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, రూ.10,000 నగదు, ఒక కోడిపుంజు, 12 కోడి కత్తులు, 5 ద్విచక్ర వాహనాలు, ఆరు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కానీ స్వాధీనం చేసుకున్న కోడిని మాత్రం ఏం చేయాలో అర్థం కాలేదు. న్యాయ సలహాతో కోడి పుంజును రాజేంద్రనగర్ ఉప్పరపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.

విచారణ జరిపిన న్యాయమూర్తి ఆ కోడిపుంజును వేలం వేయాలని నిర్ణయించారు. రూ.300 నుంచి మొదలైన ఈ వేలంలో మొత్తం 12 మంది పాల్గొన్నారు. హోరా హోరీగా జరిగిన వేలంలో గగన్ పహాడ్​కు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి రూ.2300కు కోడిపుంజును దక్కించుకున్నారు. కోడిని దక్కించుకున్న రామకృష్ణను కోడిపుంజును ఏం చేస్తావని న్యాయమూర్తి ప్రశ్నించగా, తన బంధువు ఫామ్​లో దాన్ని పెంచుతానని, వేలం పాటలో ఇతరులు దక్కించుకుంటే చంపేస్తారనే భయంతో తానే దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు. కోడిపుంజును దక్కించుకున్న రామకృష్ణ అనే వ్యక్తి తెంలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ వైస్‌ ప్రెసిడెంట్. కోడిపుంజును దక్కించుకున్న విషయం సహచరులు, స్నేహితులకు చెప్పిన రామకృష్ణ, ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పిన మాట ప్రకారం కోడిపుంజుకు సన్మానం చేశారు.

కోడిపుంజును దక్కించుకున్న రామకృష్ణ
కోడిపుంజును దక్కించుకున్న రామకృష్ణ (ETV Bharat)

తగ్గేదే లే అంటున్న పందెం కోళ్లు - ఒక్కోదాని ధర తెలిస్తే షాక్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.