Nani HIT Update : నేచురల్ స్టార్ నాని- దర్శకుడు శైలేశ్ కొలను కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'హిట్ 3'. 'హిట్', 'హిట్ 2' తర్వాత ఇదే ఫ్రాంచైజీలో రూపొందుతున్న సినిమా కావడం వల్ల ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. 'హిట్ ది థర్డ్ కేస్' అనేది ఈ సినిమా టైటిల్. ప్రతీ పండగకు ఓ పోస్టర్ రిలీజ్ చేస్తున్న మేకర్స్, రిపబ్లిక్ డే సందర్భంగా శనివారం కూడా ఓ అప్డేట్తో ముందుకొచ్చారు.
ఈ క్రమంలోనే ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో నాని కూల్ లుక్లో కనిపిస్తున్నారు. గన్తో సెల్యూట్ కొడుతున్న నాని లుక్ను రివీల్ చేశారు. కాగా, ఇందులో నాని పవర్ఫుల్ ఇన్వెస్టిగేటర్ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా 2025 మే 1న గ్రాండ్గా రిలీజ్ కానుంది.
Happy Republic Day. Jai hind 🇮🇳 #RepublicDay2025 #Hit3 pic.twitter.com/NylBKBCjas
— Nani (@NameisNani) January 26, 2025