Astrology Remedy to Attract Money : కొందరు ఎంత సంపాదించినా కూడా తమ వద్ద రూపాయి మిగలట్లేదని బాధపడుతుంటారు. మీరు కూడా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఇలా ఫైనాన్షియల్‌గా ఇబ్బందిపడేవారు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు వేణుగోపాల్. ఇంతకీ, ఆ పరిహారం ఏంటి? ఆచరించాల్సిన విధానమేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
ప్రతిఒక్కరూ సర్వ సంపదలు పొంది సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. కానీ, కొందరు ఎంత సంపాదించినా ఆర్థిక సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. అలాంటివారు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఎల్లవేళలా అనుగ్రహాన్ని ప్రసాదించే అద్వితీయమైన కస్తూరికాయతో ఈ చిన్న పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలను చూస్తారంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు వేణుగోపాల్. పుత్ర పౌత్రాభివృద్ధితోపాటు సిరిసంపదలు పొందుతారంటున్నారు.
ఏం చేయాలంటే?
మీ జన్మ నక్షత్రం లేదా మీకు నచ్చిన వారం నాడు లేదా మీ అదృష్ట సంఖ్యను బట్టి గానీ కస్తూరికాయను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవాలి. ఆ తర్వాత స్నానమాచరించి దాన్ని పూజామందిరంలో ఉంచాలి. ఆపై పసుపు, కుంకుమలతో పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. అనంతరం నాలుగు గురివింద గింజలు కూడా దానిలో వేసి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఇష్టదైవాన్ని తలుచుకొని "అంతా పరమాత్మ లీల నేను నిమిత్త మాత్రుని సర్వం శివమయం జగత్" అని మనసులో చెప్పేసుకొని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవాలి. అనంతరం పూజ కార్యక్రమాలు చేపట్టి, ఆ కస్తూరికాయను మీ ఇంట్లో ధనం దాచుకునే చోట ఉంచాలి. ఇలా ఉంచినట్లయితే మీకు సర్వ సంపదలు సిద్ధిస్తాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు వేణుగోపాల్. మీ వంశం కూడా అభివృద్ధిలోకి వస్తుందంటున్నారు. అంతేకాదు, ఈ కాయ తరతరాలుగా పనిచేస్తుందంటున్నారు.
కస్తూరి కాయ అనేది హిమాలయ పర్వత ప్రాంతాలలో కస్తూరి అనే మృగం వీపు పైన ఉద్భవించేటటువంటి అద్వీతయమైన కాయ. దీన్నే కస్తూరి అంటారు. ఈ కాయ అంత ఈజీగా పాడవ్వదు కూడా. అయితే, ఇటీవల కాలంలో కస్తూరి కాయలలో బూడిద పోసి అమ్ముతున్నారు. కాబట్టి, మీరు కస్తూరి కాయను కొనేముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇవీ చదవండి :
'ఉదయం నిద్రలేవగానే ఎవరి ముఖం చూడాలో మీకు తెలుసా?'
'ఈ 3 వస్తువులు కలిపి చీమలకు పెట్టండి - మీ డబ్బు రెట్టింపు అవ్వడం ఖాయం!'