ETV Bharat / spiritual

రేపే "కృష్ణ అంగారక చతుర్ధశి" - ఇలా చేస్తే భయంకరమైన అప్పులు తీరిపోతాయట! - KRISHNA ANGARAKA CHATURDASHI 2025

-సూర్యగ్రహణానికి సమానమైన "కృష్ణ అంగారక చతుర్ధశి" -జ్యోతిష్యం ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే రుణ విముక్తి

Krishna Angaraka Chaturdashi 2025
Krishna Angaraka Chaturdashi 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2025, 12:10 PM IST

Krishna Angaraka Chaturdashi 2025: అప్పులు లేకుండా జీవితం సాఫీగా, ఆనందంగా సాగాలని అందరూ కోరుకుంటారు. కానీ, మనలో చాలా మంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేస్తుంటారు. కొన్ని రోజుల తర్వాత అవి తీర్చలేనంత భారంగా మారిపోతాయి. దీంతో నలుగురిలో తలెత్తుకోలేక అవమానంగా భావిస్తుంటారు. అయితే, కృష్ణ అంగారక చతుర్దశి రోజు ఇలా చేస్తే తీవ్రమైన అప్పుల నుంచి విముక్తి పొందవచ్చని ప్రముఖ జ్యోతిష్యుడు 'మాచిరాజు కిరణ్​ కుమార్'​ చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రతీ నెలలో బహుళపక్షంలో వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దానిని "కృష్ణ అంగారక చతుర్దశిగా" పిలుస్తారని మాచిరాజు చెబుకున్నారు. కృష్ణ అంగారక చతుర్దశి ప్రత్యేకత ఏంటంటే, సూర్యగ్రహణంతో సమానమైన శక్తి ఈ తిథికి ఉంటుందట. సూర్యగ్రహణం రోజు స్నానం, దానం, పితృ కార్యం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో, కృష్ణ అంగారక చతుర్దశి రోజు కూడా స్నానం, దానం చేస్తే అటువంటి ఫలితాలే కలుగుతాయని చెబుతున్నారు. ఈ సంవత్సరం జనవరి 28వ తేదీ మంగళవారం నాడు ఈ చతుర్దశి వచ్చిందని అంటున్నారు. మరి అప్పులు తీరాలంటే ఆ రోజు ఏం చేయాలంటే,

అప్పులు తీరాలంటే: తీవ్రమైన అప్పులతో బాధపడుతున్నవారు కృష్ణ అంగారక చతుర్దశి రోజు "రుణ విమోచన అంగారక స్తోత్రం" చదవాలని చెబుతున్నారు. ఆ రోజు ఎవరైనా సరే ఈ స్తోత్రం చదివినా, విన్నా భయంకరమైన అప్పులు తీరిపోతాయని అంటున్నారు. ఏ స్తోత్రాలు చదువుకోలేని వారు "ఓం అం అంగారకాయ నమః" అనే మంత్రాన్ని స్మరించుకున్నా మంచిదంటున్నారు.

ఇవి చేసినా మంచి ఫలితాలు:

  • స్నానం చేసే నీటిలో గంగాజలం కలిపి చేస్తే మంచిదట. గంగాజలం లేకపోతే స్నానం చేసేటప్పుడు "గంగా గంగా" అనుకుంటూ చేసినా శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు.
  • కృష్ణ అంగారక చతుర్దశి రోజు దానం చేసినా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. గ్రహ దోష తీవ్రత కూడా తగ్గుతుందట. ఆరోజున ఒకటింపావు కేజీ గోధుమలను బ్రాహ్మాణులకు దానం చేయాలని చెబుతున్నారు.
  • ఈ తిథి రోజున యమధర్మరాజుకు తర్పణం ఇచ్చినా మంచి జరుగుతుందట. తర్పణం ఎలా ఇవ్వాలంటే, స్నానం చేసిన తర్వాత ఇంటి యజమాని దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులను నీటిలో కలిపి యమధర్మరాజుకు తర్పణం ఇవ్వాలని అంటున్నారు.
  • ఈ రోజున సూర్యునికి తర్పణం ఇచ్చినా మంచిదేనట. తర్పణం ఎలా ఇవ్వాలంటే, రాగి చెంబులో నీళ్లు, ఎర్రపూలు, కుంకుమ కలిపిన అక్షతలు వేసి ఇంటి యజమాని తూర్పు వైపు తిరిగి "ఓం గృణిహిః సూర్య ఆదిత్య ఓం" అనే మంత్రాన్ని 12 సార్లు చెబుతూ మొక్కలకు సమర్పించాలి.
  • సొంతింటి కల నెరవేరాలంటే కృష్ణ అంగారక చతుర్దశి రోజు కందులు దానం ఇవ్వాలని అంటున్నారు. కేజింపావు కందులను ఎర్రటి వస్త్రంలో కట్టి ఉదయం ఆరు నుంచి 7 మధ్యలో, లేదా మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో దేవాలయంలో పూజారికి దానం ఇవ్వాలని అంటున్నారు. అలా కుదరని పక్షంలో కందులను నానబెట్టి, బెల్లం కలిపి గోమాతకు తినిపించినా సొంత ఇంటి కల తీరుతుందని అంటున్నారు.
  • కృష్ణ అంగారక చతుర్దశి రోజు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహ స్వామి ఆలయాలను దర్శిస్తే మంచిదని చెబుతున్నారు. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదివినా, నరసింహ కరావలంబం స్తోత్రం చదివినా విశేష ఫలితాలు కలుగుతాయంటున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.