Health Checkups Before Dos and Don'ts : మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో తెలుసుకోవడానికి రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చాలా అవసరం. అయితే, సరైన రిజల్ట్ కోసం వైద్య పరీక్షలు చేయించుకునే ముందు, డాక్టర్‌ను సంప్రదించే ముందు కొన్ని పనులు చేయకూడదని నిపుణులు అంటున్నారు. లేదంటే టెస్టుల్లో సరైన ఫలితం రాక అనవసరంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందంటున్నారు. మరి చేయకూడని పనులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
హెల్త్ చెకప్స్‌కు ముందు చేయకూడనివి :
బీపీ చెకప్ :ఈ రోజుల్లో ఎక్కువ మంది బీపీ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బందిపడుతున్నారు. అయితే బీపీ(Blood Pressure) చెకప్‌కు వెళ్లే ముందు కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. అవేంటంటే.. బీపీ చెకప్‌కి వెళ్లాలనుకుంటే మీ అపాయింట్‌మెంట్‌కు కనీసం ఒక గంటలోపు కాఫీ లేదా ఇతర కెఫిన్ పానీయాలు తాగడం మానుకోవాలి. ఎందుకంటే కెఫిన్ మీ రక్తపోటును పెంచుతుంది. ఫలితంగా తప్పుడు రిజల్ట్స్ చూపించే అవకాశం ఉంటుంది. అలాగే బీపీ చూయించుకోవడానికి ముందు ధూమపానం చేయడం కూడా మంచిది కాదంటున్నారు. ఇక బీపీ చెకప్‌కు ముందు కాసేపు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత చెక్ చేయించుకోవడం బెటర్.
రక్తపరీక్ష : చాలా మంది రక్త పరీక్షకు వెళ్లే ముందు కళ్లు తిరుగుతాయనో, ఇంకేదో కారణం చేత కొన్ని పదార్థాలు తిని వెళ్తారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే మీరు బ్లడ్ టెస్ట్‌కు వెళ్లే ముందు ఎట్టి పరిస్థితుల్లో కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను తినొద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.
కొలెస్ట్రాల్ పరీక్ష : మీరు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే టెస్ట్‌కు ముందు మద్యం సేవించవద్దనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆల్కహాల్ మీ ట్రైగ్లిజరైడ్‌లను మారుస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్ పరీక్షకు 24 గంటల ముందు వరకు మద్యం తీసుకోకుండా ఉండటం మంచిది. అలాగే కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకునే ముందు స్వీట్లు కూడా తినకూడదు. ముఖ్యంగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలకు సంబంధించిన పరీక్షలు పరగడుపున(8 నుంచి 10 గంటలు) తినకుండా ఉండి చేయించుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.
ఈ మూడిట్లో మీ శరీరంలో ఏ దోషం ఉంది? - ఇది తెలియకనే సకల రోగాలు!