Causes for Burning Sensation In Stomach After Eating:గతంలో ఎసిడిటీ కారణంగా కడుపులో మంట, జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు కేవలం ఒక వయసు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారిలోనూ ఈ సమస్యలు కనిపిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. అయితే కొద్దిమందికి తిన్న వెంటనే కడుపులో మంట మొదలవుతుంది. అప్పుడప్పుడు ఇలా రావడం కొంత వరకు ఓకే కానీ.. తిన్న తర్వాత ప్రతిసారీ బర్నింగ్ సెన్సేషన్ ఒక పెద్ద వ్యాధికి సంకేతం అంటున్నారు నిపుణులు. అసలు భోజనం చేసిన తర్వాత కడుపులో, ఛాతీలో మంటగా అనిపించే సమస్య ఎందుకు వస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కీళ్లవాతాన్ని విటమిన్ డి తగ్గిస్తుందా ? నిపుణులు ఏమంటున్నారు ?
ఆహారం తిన్న తర్వాత కడుపులో మంటగా అనిపించే సమస్యకు కారణం అంటే ప్రత్యేకంగా ఇది అని చెప్పలేం. అందులో మొదటిది.. ముఖ్యమైనది..
గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD): గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) అనేది దీర్ఘకాలిక స్థితి. ఇది అన్నవాహికలోకి కడుపులోని ఆమ్లం తిరిగి ప్రవహించినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. GERD ప్రధాన లక్షణం గుండెల్లో మంట, తరచుగా ఛాతీలో మంట రావడం. దీనితో పాటుగా నోటిలోకి పుల్లని లేదా చేదు ద్రవాలు తిరిగి రావడం, అలాగే గుండెల్లో మంట, వికారం రెండింటినీ ఏకకాలంలో అనుభవించడం ఈ సమస్య లక్షణాలు..