Can Exercise Pill Replace Workout :కాలం బాగా మారిపోయింది. రోజురోజుకీ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల మానవ జీవన శైలిలో భారీ మార్పులు సంభవించాయి. పనులన్నీ సులభమయ్యాయి. బద్దకం పెరిగింది. దీంతో పాటు సౌకర్యాలూ పెరిగాయి. ఈ క్రమంలో కొన్ని సమస్యల నివారణకు పిల్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్ ఉపయోగించవచ్చు. ఇప్పడు ఇలాంటి పిల్స్‌ను వ్యాయమం కోసం కూడా వినియోగిస్తున్నారు. ఇంతకీ ఆ ఎక్సర్సైజ్ పిల్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది అనే వివరాలు తెలుసుకుందాం.
కొందరు శాస్త్రవేత్తలు కాంపౌండ్స్‌ను కనిపెట్టారు. అవి వర్కవుట్ ఫిజికల్ బూస్టింగ్‌ను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతాయి. భవిష్యత్తులో ఇది మెటబాలిజం పెరిగేందుకు తోడ్పడుతుందని, కండరాల పనితీరును మెరుగు పరుస్తుందని విశ్వసిస్తున్నారు. మనిషికి వ్యాయామం ఎంతో ముఖ్యమైంది. దాని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కానీ అందుకు సంబంధించి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని ప్రధాన శాస్త్రవేత్త అయిన బాహా ఎల్జెండి అన్నారు. ఎల్జెండి బృందం సృష్టించిన కొత్త సమ్మేళనాలు భవిష్యత్తులో వ్యాయామ మాత్రగా పనికొస్తుందని వారు నమ్ముతున్నారు.
ఈ ఎక్సర్సైజ్ పిల్ మీ ఫిట్నెస్ లక్ష్యాల్ని చేరుకోవడంలో సాయం పడదు కానీ, మిగతా వాటికి ఉపయోగపడుతుంది. గుండె జబ్బులు, న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు, కండరాల క్షీణత వంటి వాటికి చికిత్స చేయడానికి సహాయపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. వృద్ధులు, క్యాన్సర్ కారణంగా బలహీనంగా మారిన, ఎక్సర్సైజ్ చేయలేని వ్యక్తులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా బరువు తగ్గించడానికి వాడే మందుల వల్ల కలిగే నష్టం నుంచి కాపాడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.