Best Tips to Improve Eye Vision :కాలుష్యం, మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కూడా కంటి చూపును దెబ్బ తీస్తాయని మీకు తెలుసా? ఈరోజుల్లో ఎక్కువ మందిని లాంగ్ సైట్, షార్ట్ సైట్ లోపాలు, శుక్లాలు వంటి సమస్యలకు ఇవే కారణాలు! మరి.. ఈ పరిస్థితి మీకు రాకూడదంటే.. నిపుణులు సూచించిన ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే! అవేంటో ఇప్పుడు చూద్దాం.
సన్ గ్లాసెస్ ధరించడం : సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలుకళ్ల(Eyes) ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వాటి నుంచి కళ్లను రక్షించుకోవడానికి మంచి నాణ్యత గల సన్ గ్లాసెస్ ధరించడం అవసరం. లేదంటే.. ఎండలో తిరిగినప్పుడు కళ్ల రక్షణకు టోపీ కూడా సహాయపడుతుంది.
సమతుల ఆహారం :కంటి చూపు మెరుగుపరుచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రధానంగా తీసుకునే ఆహారంలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు, ఎ, సీ ఉండేటట్లు చూసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు అధికమొత్తంలో తీసుకోవాలి. ఎందుకంటే ఇవి పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. పాలకూర, కొల్లార్డ్ గ్రీన్, కాలే వంటివి కూడా కంటి ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడతాయి. అలాగే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే సాల్మన్ వంటి చేపలు తీసుకోవాలి. ఇవి కంటి చూపు మెరుగు పడేందుకు దోహదపడతాయి.
కాంటాక్ట్ లెన్సులు :మీరు కాంటాక్ట్ లెన్సులు యూజ్ చేస్తున్నట్లయితే వాటి శుభ్రత విషయంలో జాగ్రత్త ఉండాలి. కొందరు వాటిని ధరించనప్పుడు ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటారు. ఆ కారణంగా వాటిపై వైరస్, బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. ఫలితంగా కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కాంటాక్ట్ లెన్సులు సరిగ్గా శుభ్రం చేయడంతో పాటు జాగ్రత్తగా దాచుకోవాలి.
డైలీ ఈ పొరపాట్లు చేస్తున్నారా? - అయితే మీ కళ్లు దెబ్బతినడం ఖాయం!
ఫ్రెష్ టవల్ యూజ్ చేయడం : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఇంట్లో వారందరూ ఫేస్ వాష్‌కి ఒకే టవల్ యూజ్ చేస్తుంటారు. కానీ, అది కళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందట. ముఖ్యంగా ఫేస్ టవల్‌ను షేర్ చేసుకోవడం వల్ల పింక్ ఐ ప్రాబ్లం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ముఖం తుడుచుకోవడానికి సపరేట్ టవల్ యూజ్ చేయడం మంచిది. అలాగే దిండ్లు, మేకప్ బ్రష్‌లు షేర్ చేసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు.
కళ్లద్దాలు ధరించడం : దుమ్ము, ధూళి లాంటివి కళ్లలో పడకుండా రక్షణ కళ్లజోళ్లు ధరించడం తప్పనిసరి. లేదంటే ఇది కార్నియల్ రాపిడికి దారి తీసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా గాగుల్స్ ధరించాలి. ఎందుకంటే మీ కళ్లు క్లోరిన్ వంటి రసాయనాలకు గురవుతాయి.
వాకింగ్ : డైలీ వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చనే విషయం తెలిసిందే. కంటి ఆరోగ్యానికి వాకింగ్ అనేది చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కళ్లకు మెరుగైన రక్తప్రసరణ జరుగుతుందట. ఒక అధ్యయనం ప్రకారం.. వారానికి 150 నిమిషాల వ్యాయామం గ్లకోమాను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని కనీసం 40% తగ్గిస్తుందట.
కంప్యూటర్ స్క్రీన్ విషయంలో జాగ్రత్తలు : మీరు ఎక్కువగా కంప్యూటర్ ఎక్కువగా యూజ్ చేస్తున్నట్లయితే అది ఎప్పుడూ కంటి స్థాయికి దిగువన ఉండాలి. ఇలా ఉండడం మీ కళ్లు కొద్దిగా మూసుకుపోయేలా చేస్తుంది. అలాగే డ్రై ఐ సిండ్రోమ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా మీరు ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూచోవాల్సి వచ్చినప్పుడు లేదా చదువుతున్నప్పుడు ప్రతి 30 నిమిషాలకు విరామం తీసుకోవడం మంచిది. ఇది కంటి అలసటను నివారించడంలో సహాయపడుతుంది.
ఇవేకాకుండా ప్రాసెస్ చేసిన కొవ్వు పదార్ధాలను తగ్గించుకోవడం, పడుకునే ముందు మేకప్ తొలగించడం, ధూమపానానికి దూరంగా ఉండడం, నెలవారీ మీ రక్తపోటును తనిఖీ చేసుకోవడం వంటివి కూడా కళ్లు ఆరోగ్యంగా ఉండడంలో దోహదపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కళ్లు పొడిబారుతున్నాయా? ఇలా చేస్తే హాయిగా ఉంటుంది!