తెలంగాణ

telangana

ETV Bharat / health

మీరు రోజూ ఏ టైమ్​కి స్నానం చేస్తున్నారు? - ఆయుర్వేదం ఏమంటోంది? - Ayurvedic Bathing Rules

Best Time to Bath : స్నానం చేయడానికి ఏది సరైన సమయమో మీకు తెలుసా? కరెక్ట్ టైమ్​లో స్నానం చేయకపోతే ఏమవుతుందో తెలుసా? ఈ విషయంలో ఆయుర్వేదం ఏం చెబుతోంది??

Bath
Best Time to Bath

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 4:39 PM IST

Best Time to Bath As Per Ayurveda : ఆరోగ్యంగా ఉండడంలో తినే ఆహారపదార్థాలు, నిద్రే కాదు.. స్నానం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఒత్తిడిని ఎదుర్కోవడానికి, బాడీ రీలాక్స్ అవ్వడానికి స్నానం చాలా సహాయపడుతుంది. అయితే.. మీరు స్నానం ఎలా చేస్తారు? ఎప్పుడు చేస్తారు? అనేది కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

స్నానానికి ఉత్తమ సమయం..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు రెండు సార్లు స్నానం చేయాలని ఆయుర్వేదం చెబుతోంది. అందులో మొదటిది కాల కృత్యాలు తీర్చున్న తర్వాత చేయాలట. అది కూడా సూర్యోదయానికి ముందే స్నానం ముగించాలని సూచిస్తున్నారు నిపుణులు. రెండోసారి సూర్యాస్తమయం టైమ్​లో గోరువెచ్చని వాటర్​తో బాత్ చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఒత్తిడిని తగ్గించడంతో పాటు కండరాలు, నరాలకు మంచి విశ్రాంతి లభిస్తుందంటున్నారు. నైట్ ప్రశాంతంగా నిద్రపోవడానికీ చాలా బాగా సహాయపడుతుంద.

తగినంత నీరు :చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. ఏదో ఆదరాబాదరాగా తక్కువ వాటర్​తో స్నానం చేస్తుంటారు. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం.. చక్కగా మనసారా స్నానం చేయాలట. ఇందుకోసం పుష్కలంగా నీటిని ఉపయోగించాలని సూచిస్తున్నారు.

ఆయిల్ మసాజ్ : స్నానానికి ముందు శరీరానికి అభ్యంగ లేదా ఆయిల్ మసాజ్ చేయాలట. ఇది ఆయుర్వేద స్నానంలో ప్రధాన భాగం. ఇందుకోసం నువ్వుల నూనె ఉపయోగించాలి. ఇది చాలా శ్రేష్టమైనది. అయితే.. మీకు అందుబాటులో ఉండే కొబ్బరి నూనె లేదా బాదం నూనె కూడా ఉపయోగించవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇది చర్మానికి పోషణ అందించడంతోపాటు అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుందట. అలాగే.. ఆయిల్ మసాజ్ తర్వాత వెంటనే వాటర్​తో శుభ్రం చేసుకోకుండా దానికి ముందు కొద్దిగా హెర్బల్ పౌడర్​ను బాడీకి రుద్ది నెమ్మదిగా మర్దన చేసుకొని ఆ తర్వాత స్నానం చేయడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది.

నీటి ఉష్ణోగ్రత : ఇక మీరు స్నానం చేసేటప్పుడు మంచి ఫీలింగ్ పొందడానికి గోరువెచ్చని వాటర్ యూజ్ చేయడం మంచిది. అంతేకాకుండా.. ఈ వాటర్​ను డైరెక్ట్​గా తలపై పోసుకోవొద్దని సూచిస్తున్నారు. అదేవిధంగా.. తలస్నానం చేయడానికి కొందరు చాలా వేడిగా ఉండే వాటర్​ ఉపయోగిస్తుంటారని, అలా కాకుండా గోరు వెచ్చని నీటినే ఉపయోగించాలని సూచిస్తున్నారు.

తిన్న వెంటనే స్నానం :ఎక్కువ మంది చేసే పొరపాటు తిన్న వెంటనే స్నానం చేయడం. కానీ అలా చేయడం మంచిది కాదని చెబుతున్నారు.. ఇలా స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల కంటే.. నష్టాలే ఎక్కువ అని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. తిన్న తర్వాత స్నానం చేస్తే.. జీర్ణ క్రియపై వ్యతిరేక ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఈ సూచనలు పాటిస్తూ.. సరైన సమయంలో స్నానం చేయడం ద్వారా.. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

స్నానం చేసేటప్పుడు లూఫా వాడే అలవాటు ఉందా? - సమస్యలు తప్పవట!

వేడి నీళ్లతో స్నానం చేస్తే ఎన్ని లాభాలో.. షుగర్ వ్యాధి సైతం దూరం!

ABOUT THE AUTHOR

...view details