LIVE : మహబూబ్​నగర్​ ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా కాలేజీలో ముగ్గుల పోటీలు - ప్రత్యక్షప్రసారం - RANGOLI CONTEST AT MAHABUBNAGAR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2025, 1:04 PM IST

Updated : Jan 6, 2025, 2:25 PM IST

Rangoli Contest at NTR Government Womens College : సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసేలా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలకు విశేష స్పందన వస్తోంది. పలు కళాశాలకు చెందిన విద్యార్థినిలు అధిక సంఖ్యలో పోటీల్లో ఉత్సాహంగా పాల్లొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. మహబూబ్​నగర్​ ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా కాలేజీలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. ముగ్గుల పోటీల్లో 110 మంది విద్యార్థినిలు పాల్గొని  వివిధ రకాల ముగ్గులు వేశారు. విజేతలుగా నిలిచిన వారు ఈనెల 10న మహబూబ్​నగర్ స్థాయిలో జరిగే పోటీలకు అర్హత సాధించారు. మహబూబ్​నగర్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బాపూ బొమ్మలు- ముత్యాల ముగ్గులు పేరిట నిర్వహించిన పోటీల్లో విద్యార్థినిలు ఉత్సాహంగా పాల్గొని రంగు రంగుల ముగ్గులను వేశారు. తాజాగా మహబూబ్‌నగర్ ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా కాలేజీలో ఈనాడు ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో ఆ ముగ్గుల పోటీలను తిలకిద్దాం.
Last Updated : Jan 6, 2025, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.